దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 326 పాయింట్లు కోల్పోయి 40 వేల 543 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 11 వేల 949 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
ఎస్ బ్యాంకు, ఇండస్ఇండ్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్ రాణిస్తున్నాయి.
ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్, లార్సెన్ అండ్ టుబ్రో, యాక్సిస్ బ్యాంకు, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో ఆసియా మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ 19 పైసలు కోల్పోయింది. ప్రస్తుతం ఒక డాలరుకు రూ.72.01గా ఉంది.
ముడిచమురు ధర
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 69.23 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 6.8 శాతం పెరిగిన భారత నెలవారీ తలసరి ఆదాయం