ETV Bharat / business

భారీ నష్టాల నుంచి కాస్త తేరుకున్న దేశీయ సూచీలు - స్టాక్​ మార్కెట్ లేటెస్ట్​ అప్​డేట్స్​

stock market live updates
stock market live updates
author img

By

Published : Mar 4, 2022, 9:20 AM IST

Updated : Mar 4, 2022, 1:06 PM IST

13:03 March 04

పుంజుకున్న మార్కెట్లు..

భారీ నష్టాల నుంచి స్టాక్​ మార్కెట్​ సూచీలు కాస్త తేరుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్​ 300 పాయింట్ల నష్టంతో.. 54 వేల 800 దిగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 380 వద్ద ఉంది.

10:30 March 04

1000 పాయింట్లు పతనం..

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 1000 పాయింట్లకుపైగా పడిపోయింది. ప్రస్తుతం 1077 పాయింట్ల నష్టంతో.. 54 వేల 25 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 322 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 175 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్​ 30 ప్యాక్​లో ఐటీసీ, టాటా స్టీల్​ మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, రియాల్టీ, బ్యాంకింగ్​ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బీఎస్​ఈ మిడ్​, స్మాల్​ క్యాప్​ సూచీలు 1-2 శాతం మేర పడిపోయాయి.

లాభనష్టాల్లో..

యూపీఎల్​, ఐటీసీ, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, టాటా స్టీల్​ రాణిస్తున్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్​, ఐచర్​ మోటార్స్​, హెచ్​యూఎల్​ డీలాపడ్డాయి.

08:56 March 04

న్యూక్లియర్​ ప్లాంట్​పై రష్యా అటాక్​.. కుప్పకూలిన మార్కెట్లు

stock market live: ఉక్రెయిన్​- రష్యా యుద్ధప్రభావంతో స్టాక్​ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభంలోనే భారీ నష్టంతో ప్రారంభమైంది.

సెన్సెక్స్​ 730 పాయింట్ల నష్టంతో.. 54 వేల 390 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లకుపైగా కోల్పోయి.. 16 వేల 280 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో ఇవే..

హిందాల్కో, టాటా స్టీల్​, కోల్​ ఇండియా, బీపీసీఎల్​, ఎన్​టీపీసీ రాణిస్తున్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, టాటా మోటార్స్​, విప్రో, బజాజ్​ ఆటో డీలాపడ్డాయి.

Last Updated : Mar 4, 2022, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.