ETV Bharat / business

పసిడి వైపు చూడొచ్చా ఇప్పుడు?

అసలే ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటే, మేలిమి బంగారం ధర రూ.50,000కు చేరువవుతోంది. మరి ఈ స్థాయిలో కొనుగోలు చేయొచ్చా.. ధర తగ్గే అవకాశాలున్నాయా.. ఈ సందేహం వివాహాది శుభకార్యాలు నిర్ణయించుకున్న కుటుంబాలన్నింటిలో ఉంది. కొనుగోళ్ల విషయానికి వస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారులు ఊహించినదాని కంటే మిన్నగానే అమ్మకాలు సాగుతున్నాయని బులియన్‌ గణాంకాలు చెబుతున్నాయి.

GOLD PRICES
పసిడి వైపు చూడొచ్చా ఇప్పుడు?
author img

By

Published : Jun 28, 2020, 7:07 AM IST

  • -4.9 శాతం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఐఎంఎఫ్‌ అంచనా
  • 40 శాతం, ఏడాది కాలంలో పసిడి ట్రేడెడ్‌ ఫండ్స్‌ ఇచ్చిన ప్రతిఫలం

ఈ గణాంకాలే తేల్చి చెబుతున్నాయి, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో బంగారంపై ప్రపంచానికి ఉన్న నమ్మకం. ప్రపంచ వృద్ధిరేటుపై ఆందోళనలకు తోడు, ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుతున్నాయన్న అంచనాల మధ్య, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు 'సురక్షిత పెట్టుబడి'గా భావిస్తూ బంగారాన్ని కొంటున్నాయి. స్టాక్‌మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉంటున్నందున అంతర్జాతీయ పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. అందుకే ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 1750 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది 1780-1800 డాలర్ల వరకు వెళ్లొచ్చనే అంచనాలున్నాయి.

కారణాలివీ

  • బంగారం గనుల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు-ఇతర నిర్వహణ ఖర్చులు పెరగడం
  • వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేయడం
  • ఇతర పెట్టుబడుల కంటే అధిక ప్రతిఫలం లభించడం కనుక సాధారణ మదుపర్లు కూడా పసిడి వైపే రావడం.

ధరలపై ప్రభావం చూపే అంశాలు

  1. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు, చైనాతో అమెరికా, భారత్‌ వైరం
  2. కేంద్ర బ్యాంకులు ఎంతకాలం కొనుగోలు చేస్తాయి
  3. స్టాక్‌మార్కెట్లు ఎప్పటికి రాణిస్తాయనేది ప్రధానం
  4. ఆర్థిక ఇబ్బందులున్న ఏ దేశమైనా పసిడి నిల్వలు విక్రయిస్తే ధర తగ్గుతుంది

దేశీయంగా..

కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా దేశీయంగా రెండు నెలల పాటు పసిడి ఆభరణాలు, మేలిమి బంగారం విక్రయించే బులియన్‌ సంస్థలూ మూతబడ్డాయి. వివాహాది శుభకార్యాలు నిర్ణయించుకున్న వారు, ఆషాఢమాసం (జూన్‌ 22 - జులై 20) ముందే కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో, దుకాణాలు తెరవగానే విక్రయాలు ఫరవాలేదనేలా ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లో రోజుకు 100 కిలోల బంగారం విక్రయమైతే, ఇప్పుడు 50 కిలోల మేర జరుగుతోందని తెలంగాణా బులియన్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చందా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతమేర జరగడమూ ఊరట కలిగిస్తోందన్నారు.

ధర పెరిగినా ఎందుకు వస్తున్నారు?

దేశీయంగా పెళ్లిళ్లకే బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తుంటారు. కొవిడ్‌ వల్ల పెళ్లిళ్లు ఆడంబరంగా చేయడం, వందలు-వేలమందితో భారీ వేదికల్లో భోజనాలు పెట్టడం నిలిచిపోయింది. ఈ మేర మిగిలిన నిధులతో బంగారం కొనుగోలు చేసి వధూవరులకు ఇస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పసిడి అమ్మకాల్లో 75 శాతం ఆభరణాలకు తరలుతోందని, 25 శాతమే పెట్టుబడిగా బిస్కెట్ల రూపంలో ఉంటోందని వెల్లడిస్తున్నారు. 100 గ్రాముల మేలిమి బంగారం రూ.4,95,000 అవుతున్నా, నష్టం ఉండదనే భావనలో మధ్యతరగతి వారూ ముందుకొస్తున్నారని తెలిపారు.

ఏం చేయొచ్చు?

ఆభరణాలు అవసరమైన వారే ప్రస్తుత ధరల్లో కొనుగోలు చేయాలని, దీర్ఘకాల పెట్టుబడి దృక్పథంతో అయితే 10 గ్రాముల మేలిమి బంగారం రూ.47000 స్థాయిలో కొనుగోలు చేయడం మేలని బులియన్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

  • 2001, 2008 ఆర్థిక సంక్షోభాల తరవాతా, త్వరగా పునరుత్తేజం లభించింది పసిడి ధరల్లోనే. 2001 కనిష్ఠ స్థాయిల నుంచి 240 శాతం, 2008లో 170 శాతం ప్రతిఫలం లభించింది
  • 2013లో 10 గ్రాములు గరిష్ఠంగా రూ.35,000 చేరినా, అప్పుడు కొన్నవారు కూడా దీర్ఘకాలంలో లాభాలు పొందారు. అందువల్ల మొత్తం పొదుపులో 10-15 శాతాన్ని బంగారంపైకి, గోల్డ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌లలోకి మళ్లిస్తే ఇబ్బంది ఉండదు.

ఇదీ చూడండి: 'పెట్రో బాదుడుతో నిండుకుండల్లా ప్రభుత్వ ఖజానాలు​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.