ETV Bharat / business

పండుగ సీజన్​లో కొనుగోళ్లు.. ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?

పండుగ సీజన్​లో వివిధ సంస్థలు, ఆన్​లైన్ కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులైన కొందరు వినియోగదారులు... అవసరమున్నా, లేకపోయినా.. వెనకా ముందు ఆలోచించకుండా బట్టలు, నగలు, ఎలక్ట్రానిక్​ వస్తువులు​ కొనుగోలు చేసేస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత అయ్యే ఇది అనవసరంగా కొన్నానంటూ బాధపడుతుంటారు. పండుగ సీజన్​లో సాధారణంగా ఈ తప్పులు జరుగుతుంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని, ప్రణాళిక ప్రకారం డబ్బు ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Special story on festive buying mistakes
పండుగ కొనుగోళ్లు... ఈ తప్పులు మీరు చేస్తున్నారా?
author img

By

Published : Oct 24, 2020, 9:50 AM IST

దసరా, దీపావళి... ఈ రెండు పండుగలు చాలా ముఖ్యమైనవి. ఈ సీజన్​లో చాలా మంది బట్టలు, నగలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. వివిధ కంపెనీలు, ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే ఆఫర్లు వినియోగదారులను ప్రేరేపించేలా ఉంటాయి. దీంతో తెలియకుండానే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అనంతరం ఇది కొనుగోలు చేయాల్సింది కాదు అనే భావనలోకి వస్తారు.

పండుగ వేళ ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడటం, కొనుగోళ్లు చేసి తర్వాత చెల్లించే సదుపాయాలను ఉపయోగించుకోవటం వల్ల భారం పెరుగుతుంది. దీంతో ఆర్థికంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎక్కువగా ఖర్చు పెట్టి తర్వాత పరిస్థితిని సమీక్షించుకోవటం కంటే ముందే జాగ్రత్త పడటం మేలు. పండుగ సీజన్ సాధారణంగా చేసే తప్పులు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రణాళిక ప్రకారం వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎక్కువ ఖర్చు పెట్టడం

పండుగకు నిర్ణయించుకున్న ఖర్చుకు సంబంధించిన పరిమితిని దాటి చాలా మంది ఖర్చు చేస్తుంటారు. షాపింగ్ మాల్ లేదా ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లోకి వెళ్లగానే ఆఫర్లు ఆకర్షిస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న ఆఫర్ మళ్లీ భవిష్యత్తులో ఉండవనే భావనతో అవసరం ఉన్న వాటితో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని వల్ల బడ్జెట్​ను దాటి ఖర్చు చేస్తారు.

పండుగ తర్వాత.. చేసిన తప్పిదాన్ని తెలుసుకుంటారు. క్రెడిట్ కార్డు ఉపయోగించినట్లైతే డ్యూ ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఆర్థికంగా అత్యవసర పరిస్థితి తలెత్తినట్లయితే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బడ్జెట్​కు కట్టుబడి ఉండి, ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖర్చు చేయకూడదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఖర్చు చేయటం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. కాబట్టి వస్తువుల కొనుగోలులో నియంత్రణ వహించాలి.

ఫెస్టివల్ బోనస్​ను పూర్తిగా ఖర్చు చేసుకోవటం

దసరా, దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బోనస్​లు ఇస్తాయి. అయితే దీనిని తెలివిగా ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది దీనిని ప్రణాళిక లేకుండా ఇష్టం ఉన్నట్లు ఖర్చు చేస్తారు. వాస్తవానికి బోనస్ అనేది వాళ్లు కష్టపడి సంపాదించుకున్న మొత్తమే.

బోనస్ మొత్తాన్ని ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గృహ రుణాన్ని ముందే చెల్లించటం, వ్యక్తిగత రుణం చెల్లించుకోవటం, నైపుణ్యం పెంచుకునేందుకు ఉపయోగించుకోవటం తదితరాల కోసం ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. ఆర్థికంగా అవసరం లేనట్లయితే సంపద సృష్టించుకునేందుకు ఈ మొత్తంలో ప్రధాన భాగం ఉపయోగించుకోవచ్చని వారు అంటున్నారు.

ప్రణాళిక లేకుండా పెట్టుబడులు

పవిత్రమైన పండుగ సీజన్ పెట్టుబడులు పెట్టేందుకు సరైనదని చాలా మంది భావిస్తారు. బంగారం దుకాణాలు, స్థిరాస్తి అభివృద్ధిదారులు, బీమా కంపెనీలు.. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మంచి ఆఫర్లను ప్రకటిస్తాయి. ఈ ఆఫర్ల మాయలో పడి తిరిగి ఆలోచించకుండానే చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇలాంటి ప్రణాళిక లేని ఆర్థికంగా లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడవని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

క్రెడిట్ కార్డుల డ్యూలను చెల్లించకపోవటం

పండుగ సమయంలో కొంత మంది క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని చెల్లించకుండా షాపింగ్ కోసం ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల క్రెడిట్ కార్డు డ్యూ పెరిగి, వడ్డీ జమై తదుపరి బిల్లింగ్ సైకిల్ లో కట్టాల్సిన మొత్తం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం చెల్లించటం ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది.

రోలింగ్ ఓవర్ డ్యూలు.. క్రెడిట్ లిమిట్, 50 రోజుల వడ్డీ లేని సమయంపై ప్రభావం చూపుతుంది. సమయానికి బిల్లు చెల్లించకుంటే క్రెడిట్ స్కోరు కూడా దెబ్బ తింటుంది. పూర్తిగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించటం ద్వారా పండుగ సమయంలో ఖర్చు పెట్టుకునేందుకు వీలు ఉంటుంది. అంతేకాకుండా వడ్డీ రహిత సమయాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

బంగారం, వెండి ఎక్కువ ధరకు కొనటం

పండుగ నాడు బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ రోజుల్లో ఎక్కువ చెల్లించి మరీ కొందరు విలువైన లోహాలను కొనుగోలు చేస్తుంటారు. దీనివల్ల ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని కొంచెం కొంచెం సంవత్సరం మొత్తం కొనుగోలు చేయటం ద్వారా ధరలో హెచ్చుతగ్గుల ప్రభావం తక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. పండుగ రోజు కొనాలనుకుంటే ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తే, వీలైనంత తక్కువ మొత్తంలో కొనుగోలు చేయటం ఉత్తమమని అంటున్నారు. బంగారంపై పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: మైక్రోమ్యాక్స్‌ 'ఇన్​' మొబైల్స్‌ వచ్చేది ఆ రోజే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.