ETV Bharat / business

నేడే పార్లమెంటు ముందుకు 'ఆత్మనిర్భర్​ భారత్​' బడ్జెట్​

కరోనాకు ముందు.. కరోనాకు తరువాత.. ప్రపంచ వ్యవహారాలను తిరగరాసుకోవాల్సిన సందర్భమిది. ఈ నేపథ్యంలోనే 2021-22 కేంద్ర బడ్జెట్​ను కూడా చూడాల్సి ఉంది. నేడు ఉదయం 11 గంటలకు లోక్​సభలో ఆత్మనిర్భర్​ భారత్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. వైద్యం, మౌలిక వసతులకు పెద్దపీట వేసే అవకాశముంది. ఆరోగ్య రంగంలో కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కరోనా సుంకం విధించే అవకాశాలున్నాయి. అందుకే ఈ 'ఆశల పద్దు'కు ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది.

Sitharaman's 'Economic Vaccine'
పద్దు 2021-22: అందరి కళ్లూ 'ఆత్మనిర్భర్​ భారత్'​ బడ్జెట్​పైనే
author img

By

Published : Feb 1, 2021, 5:13 AM IST

Updated : Feb 1, 2021, 7:02 AM IST

కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్న వేళ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కరోనా సృష్టించిన సవాళ్ల సుడిగుండంలో చిక్కుకున్న అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న వార్షిక పద్దు ఆర్థిక టీకా కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడంతో పాటు ఆరోగ్య రంగం, మౌలిక వసతులు, రక్షణ రంగానికి ఎక్కువ మొత్తం కేటాయించే అవకాశం ఉంది.

ఉదయం 11 గంటలకు లోక్​సభలో వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. దేశాన్ని అన్ని రంగాల్లో సొంతకాళ్లపై నిలబడేలా చేయాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్​ తీసుకురాబోతున్నట్లు అంచనా.

కరోనా కారణంగా వివిధ సహాయాలు ప్రకటిస్తూ మినీ బడ్జెట్​ల పరంపర కొనసాగిందని, దానికి కొనసాగింపుగా బడ్జెట్​ ఉంటుందని ప్రధాని పార్లమెంటు సమావేశాల తొలిరోజు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో అందరికీ ఊరటనిచ్చే అంశాలు ఉండనున్నాయి. ఆర్థిక రంగానికి నిర్మలమ్మ ఏ టీకా ఇస్తారన్నది ఆసక్తి కలిగించే అంశం.

ఇవీ చూడండి:

పద్దు 2021: సీనియ‌ర్ సిటిజ‌న్లు ఆశిస్తోంది ఏంటి?

పద్దుపై 'పరిశ్రమ' ఆశలు, అంచనాలు ఇవే..

ప్రతిధ్వని: కరోనా కష్టకాలంలో సీతమ్మ కనికరించేనా?

భవిష్యత్తుపై భరోసాయే వ్యవస్థకు చోదకశక్తి

ఆర్థిక మంత్రి ముందు ఉన్న సవాళ్లు చిన్నవేమీ కాదు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలో గందరగోళం నెలకొంది. ఉపాధి, ఉద్యోగాలు పోయాయి. భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతో జనం ఖర్చులు తగ్గించారు. ఫలితంగా వ్యాపారాలు తగ్గాయి. దాని ప్రభావం పరిశ్రమలపై చూపించింది. ప్రభుత్వ ఆదాయాలు పడిపోయాయి. ప్రభుత్వ వ్యయం పెరిగితేనే జనం చేతిలోకి నాలుగు డబ్బులు వస్తాయి. మరి సర్కారుకు నిధులెక్కడివి? దీనికి సమాధానం కనుక్కొని జనంలో ఆశావహ దృక్పథం నింపేందుకు ఏమి చేస్తారన్నదే బడ్జెట్‌ సారాంశం కానుంది.

కష్టాలను అధిగమించడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఆత్మనిర్భర్‌ (స్వయం సమృద్ధి) పథకాలను ప్రకటించింది. గ్రాంట్లు, పెట్టుబడులు, నగదు బదిలీ తదితర రూపాల్లో మొత్తం రూ.21 లక్షల కోట్ల వరకు సాయం ప్రకటించింది. ఇందులో ఆర్థిక ప్యాకేజీ రూ.3.5 లక్షల కోట్లు (జీడీపీలో 1.8 శాతం) వరకు ఉంది. ఒక్కసారి గణాంకాలను పరిశీలిస్తే కరోనా వచ్చే నాటికే ఆర్థిక మందగమనం ఆరంభమయింది. కొవిడ్‌ కారణంగా పరిస్థితి మరింత దిగజారింది.వృద్ధి రేటు మైనస్‌ 7.7 శాతంగా నమోదైంది. ఇటీవల కాలంలో కొంత పుంజుకుంటుండడంతో వచ్చే ఆర్థిక సంవత్సంలో 11 శాతం వృద్ధి రేటుకు అవకాశం ఉంది. ప్రస్తుత లోటును భర్తీ చేసుకుంటూ పోతే నికర వృద్ధి రేటు 4.2 శాతం నమోదుకావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ వృద్ధి రేటు ప్రగతికి చిహ్నమేమీ కాదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం కన్నా అధికంగా ఉంటేనే శీఘ్రగతిని అభివృద్ధి సాధ్యమవుతుంది.ఇందుకోసం ప్రస్తుత బడ్జెట్‌లోనే వ్యూహాలు ఉండాలి.

ఇవీ చూడండి:

బడ్జెట్​ 2021-22: ఎన్నో ఆశలు.. మరెన్నో సవాళ్లు

పద్దు 2021: పర్యటక రంగానికి మద్దతు దక్కేనా?

ఆశల వారధి మోస్తూ.. కరోనా కష్టాలు తీర్చేనా?

నిధుల సమీకరణ ఎలా?

ఆర్థిక మందగమనంలో నిధుల సమీకరణ సులువేమీ కాదు కాబట్టి నిర్మలమ్మ లోటు బడ్జెట్‌ను ఆశ్రయించవచ్చు. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 3.5 శాతానికి మించి బడ్జెట్‌లోటు ఉండకూడదన్న నిబంధన దృష్ట్యా, దాన్ని కనీసం 8 శాతం వరకు ఉండేలా సవరిస్తారని అంచనా.

  • ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్‌ పెట్రోలియం, ఎయిర్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌లను ప్రైవేటీకరణ చేయవచ్చు. రైల్వే, బ్యాంకింగ్‌ రంగంలోనూ సంస్కరణలు తెచ్చే వీలుంది. వివిధ రంగాల్లో ప్రయివేటు, విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలికే చర్యలు ఉంటాయి. నిధుల సమీకరణకు ‘కరోనా సుంకం’ విధించే అవకాశాలున్నాయని కొన్నివర్గాలు భావిస్తున్నాయి.

ఏయే రంగాలకు ప్రాధాన్యం?

  • కరోనా దృష్ట్యా సహజంగానే ఆర్థిక రంగానికి పెద్ద పీట వేసే అవకాశం ఉంది. టీకాలు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించే వీలుంది. ప్రస్తుతం జీడీపీలో 1 శాతం నిధులు కేటాయిస్తుండగా, దీన్ని 2 శాతానికి పెంచే అవకాశం ఉంది.
  • సరిహద్దుల్లో పరిస్థితుల దృష్ట్యా రక్షణ రంగానికీ సముచితంగా నిధులు కేటాయించవచ్చు.

గ్రాఫ్‌ v మాదిరా? k లాగానా..?

దేశ ఆర్థిక ప్రగతి గ్రాఫ్‌ ఎలా ఉందనేదానిపై ఆర్థిక శాస్త్రవేత్తల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది జు మాదిరిగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనా కారణంగా వృద్ధి దిగజారినా మళ్లీ పుంజుకుందని, అందుకే ఇది ఆంగ్ల అక్షరం జు మాదిరిగా ఉందని వివరించింది. అయితే ఇంకొందరు ఆర్థికవేత్తలు మాత్రం ఆంగ్ల అక్షరం రీ లాగా ఉందని చెబుతున్నారు. రీలోని పై భాగం ధనవంతులకు చిహ్నమని, వారు పైపైకి ఎదుగుతున్నారని అంటున్నారు. కింది భాగం పేదలకు చిహ్నమని వారి పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతోందని చెబుతున్నారు.

ఇవీ చూడండి:

బడ్జెట్​ ప్రత్యేకం: కట్టేది ఎక్కువ.. కట్టేవారు తక్కువ

రక్షణ బడ్జెట్‌పైనా కొవిడ్‌ ప్రభావం

బడ్డెట్: 'చిన్న పరిశ్రమ'కు ఊతమిచ్చేనా?

గృహ, పట్టణాభివృద్ధి రంగాలకు పెద్దపీట!

బడ్జెట్‌పై ఇవీ అంచనాలు..

  • ఆదాయపన్ను మినహాయింపుల పెంపు, పన్ను శ్లాబుల మార్పు
  • పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు
  • కరోనా సుంకం విధింపు
  • దేశాన్ని తయారీరంగ కేంద్రంగా మార్చడానికి ప్రోత్సాహకాలు
  • సార్వత్రిక వైద్య బీమా
  • ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి రూ.6వేల నుంచి రూ.8-10వేలకు పెంపు.
  • మౌలిక సదుపాయాల కల్పనకు అధిక కేటాయింపులు
  • పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం
  • పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలకు ప్రోత్సాహం. వ్యవసాయరంగ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
  • బంగారం దిగుమతులపై సుంకాల తగ్గింపు
  • దేశీయంగా వైద్య, విద్యుత్తు ఉపకరణాలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్‌, రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం.
  • కిసాన్‌ రైలు, విమాన సేవల విస్తృతి
  • రైలు, రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం.ప్రత్యామ్నాయ ఇంధనం, విద్యుత్తు వాహనాలకు ప్రోత్సాహం. కొత్త బుల్లెట్‌ రైలు మార్గాలు
  • వంటగ్యాస్‌పై ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీల పెంపు. * కొత్త ఎయిమ్స్‌, ఐఐటీలు
  • టెలికాం లైసెన్సుఫీజులు, స్ప్రెక్ట్రం వినియోగఛార్జీల హేతుబద్ధీకరణ.
  • పశు, మత్స్య, ఉద్యాన, ఆహారశుద్ధి, కుటీరపరిశ్రమలకు ప్రోత్సాహకం.వ్యవసాయరంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
  • ఏపీఎంసీ మార్కెట్‌ ఆధునికీకరణకు నిధులు
  • ఈ-మండీలకు రూ.800-1,000 కోట్లు..
  • భారత్‌మాల, సాగర్‌మాల ప్రాజెక్టులకు కేటాయింపుల పెంపు
  • కొత్తగా వైద్య పరిశోధనా సంస్థల ఏర్పాటుకు అవకాశం

ఇవీ చూడండి:

ప్రతిధ్వని: ఆర్థిక సర్వే ఏం చెప్పింది.. బడ్జెట్​ ఎలా ఉండబోతోంది?

'సంస్కరణలు దీర్ఘకాలానికి మంచివే'

పద్దు 2021: ఆశల పట్టాలపై భారతీయ రైలు

Last Updated : Feb 1, 2021, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.