ETV Bharat / business

'పన్నులు తగ్గించాలి.. ప్రోత్సాహకాలు అందించాలి'

author img

By

Published : Jun 9, 2019, 9:02 PM IST

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ జూలై 5న లోక్​సభలో 2019-20 వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్​లో ఆర్థిక వ్యవస్థ మందగమనం, పెరుగుతున్న నిరర్థక ఆస్తులు, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలపై దృష్టిసారించనున్నారు. పన్ను మినహాయింపులపై చెల్లింపుదారులకు భారీ అంచనాలున్నాయి.

'పన్నులు తగ్గించాలి.. ప్రోత్సాహకాలు అందించాలి'

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, సంస్థలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎమ్​ఏటీ) రద్దు చేయాలని పన్నుల రంగం నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల ఎదుగుదల, ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని చెబుతున్నారు.

చాలా ఆశలు పెట్టుకున్నారు..

దేశంలో మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ జూలై 5న తన మొదటి కేంద్ర వార్షిక బడ్జెట్​ లోక్​సభలో ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో పాటు ఇతర వాటాదారులతోనూ సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ 2019-20 వార్షిక బడ్జెట్​పై తమ వివరణాత్మక సలహాలను ఇచ్చాయి.

"అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లు భారత్​పై ప్రభావం చూపనప్పటికీ, దేశీయంగా అనేక సవాళ్లు ఉన్నాయి. బడ్జెట్​పై సామాన్య ప్రజలు మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు."
-కుల్దీప్​ కుమార్​, పార్టనర్​ అండ్ లీడర్​, పర్సనల్​​ టాక్స్​, పీడబ్ల్యూసీ ఇండియా

మధ్యంతర బడ్జెట్​లో...

మోదీ 1.0 ప్రభుత్వం ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్​లో, పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా... రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పూర్తి పన్ను రిబేటు కల్పించింది. ఇంతకు మునుపు ఈ పరిమితి రూ.3.5 లక్షలుగా ఉండేది.

ఈ చర్యవల్ల తక్కువ ఆదాయం కలిగిన వర్గం బాగా లబ్ధి పొందింది. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.
పన్నులు తగ్గించండి..

"ప్రస్తుతం బడ్జెట్​లో ప్రభుత్వం.. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.50 వేలకు(రూ2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు) పెంచే అవకాశాలున్నాయి. ప్రత్యామ్నాయంగా 5 శాతం శ్లాబును రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. ఫలితంగా పన్ను భారం 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గేలా ఉంది."- కుల్దీప్​ కుమార్​, పార్టనర్​ అండ్ లీడర్​, పర్సనల్​​ టాక్స్​, పీడబ్ల్యూసీ ఇండియా

గృహనిర్మాణ రంగానికీ చేయూతనివ్వాలని, సొంత ఇళ్లను కొనుగోలు చేయడానికి పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించాలని కుల్దీప్ సూచించారు. గృహ రుణాలపై ఉన్న వడ్డీ తగ్గింపును... ప్రస్తుతమున్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనీ ఆయన సూచించారు.

గృహరుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని, 'ప్రధానమంత్రి ఆవాస్​ యోజన పథకం' కింద గృహ వసతి కల్పించాలని పన్నుల రంగ నిపుణుడు నవీన్ వాద్వా అన్నారు.
పన్ను చట్టాలను సరళీకరించాలి

ఆదాయపన్ను చట్టంలోని కొన్ని కఠిన నిబంధనలను సరళీకరించాలని కొంతమంది న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నూతన సంస్థలకు ప్రారంభ సంవత్సరాల్లో కనీస ప్రత్యామ్నాయ పన్ను(ఎమ్​ఏటీ) నుండి పూర్తి మినహాయింపునిస్తూ టాక్స్ హాలీడే ఇవ్వాలని కోరుతున్నారు. అదనపు నగదు లభ్యతనూ చేకూర్చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే సంస్థలకు మౌలిక సదుపాయాలు, మినహాయింపుల రూపంలో ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.

ప్రస్తుతం ఇస్తున్న ప్రోత్సాహకాలు చాలా వరకు కాలం చెల్లే దశకు చేరుకున్నందున నూతన సంస్థలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సి ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పారిశ్రామిక వర్గాల అభిలాష

పారిశ్రామిక వర్గాలు...'ఎమ్​ఏటి' రద్దు చేయాలని, కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరాయి. ఈ చర్యలు వినిమయం పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని తెలిపాయి.

బడ్జెట్​లో ప్రాధాన్య అంశాలు...

ఈసారి బడ్జెట్​లో ఆర్థిక వ్యవస్థ మందగమనం, పెరుగుతున్న నిరర్థక ఆస్తులు, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలపై కేంద్రం దృష్టిసారించనుంది.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ జూలై 5న లోక్​సభలో వార్షిక బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చూడండి: సుఖోయ్​ యుద్ధ విమానాల్లో బ్రహ్మోస్​

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.