ETV Bharat / business

'భారత్ బయోటెక్​ నుంచి త్వరలోనే చుక్కలమందు టీకా' - కొవాగ్జిన్‌ టీకా చుక్కలముందు

ముక్కు ద్వారా ఇచ్చే చుక్కలమందు కరోనా టీకా.. త్వరలోనే భారత్‌ బయోటెక్‌ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్​ పరీక్షలకు సంబంధించిన సమాచారం వచ్చే రెండున్నర నెలల్లో వెల్లడవుతుందని ఆ సంస్థ తెలిపింది.

nasal vaccine of bharat biotech
భారత్​ బయోటెక్​ నాసల్​ వ్యాక్సిన్​
author img

By

Published : Jul 31, 2021, 7:02 AM IST

కొవిడ్‌-19 వ్యాధి నిరోధం కోసం ముక్కు ద్వారా ఇచ్చే చుక్కలమందు టీకా త్వరలో భారత్‌ బయోటెక్‌ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్‌ పరీక్షలకు సంబంధించిన సమాచారం వచ్చే రెండున్నర నెలల్లో వెల్లడవుతుందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల వివరించారు.

"ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ విడుదల చేసిన కొవాగ్జిన్‌ టీకా ఇంజక్షన్‌తో ఇచ్చేది. ముక్కు ద్వారా, చుక్కల మందు రూపంలో టీకా ఇవ్వడం ఎంతో సౌకర్యంగా ఉండటం సహా పంపిణీ ఎంతో సులువు అవుతుంది. దీన్ని ఆవిష్కరించడానికి భారత్‌ బయోటెక్‌ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని భారత్‌ బయోటెక్‌ కుదుర్చుంది. అధిక జనాభా గల మనదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ తరహా టీకా మేలైనది"

-డాక్టర్‌ కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ

'ముక్కు ద్వారా ఇచ్చే టీకాను నెలకు 10 కోట్ల డోసుల మేర ఉత్పత్తి చేయొచ్చు' అని డాక్టర్‌ కృష్ణ ఎల్ల తాజాగా ఫిక్కీ నిర్వహించిన సదస్సులో వెల్లడించారు. ప్రస్తుతం ఇంజెక్షన్‌ ద్వారా ఇస్తున్న రెండు డోసుల కొవాగ్జిన్‌ టీకాకు బదులు.. మొదటి డోసులో కొవాగ్జిన్‌, రెండో డోసు కింద ముక్కు ద్వారా టీకా ఇస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనే అంశాన్ని నిర్ధరించుకునే యత్నాల్లో భారత్‌ బయోటెక్‌ నిమగ్నమైంది. ఈ 'కాంబినేషన్‌ టీకా' విషయంలో తగిన ప్రయోగాలు నిర్వహించడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ని అనుమతి కోరింది. ఈ విధానంలో సత్ఫలితాలు వస్తే, కొవిడ్‌-19 వ్యాధిని ఎదుర్కొనేందుకు మరింత సామర్థ్యం లభిస్తుందని డాక్టర్‌ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: Venkaiah naidu: 'బయోటెక్నాలజీ హబ్​గా.. హైదరాబాద్​'

ఇదీ చూడండి: 'పుట్టుకొస్తున్న వేరియంట్లు.. బూస్టర్​ డోసు పడాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.