ETV Bharat / business

గూగుల్​తో సిడ్బీ జట్టు.. ఎంఎస్​ఎంఈలకు సులువుగా రుణాలు!

author img

By

Published : Nov 18, 2021, 4:59 PM IST

చిన్న పరిశ్రమలకు ఆర్థికంగా మద్దతుగా నిలిచేందుకు గూగుల్​ ఇండియాతో(sidbi google) జట్టుకట్టినట్లు ప్రకటించింది భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్​(సిడ్బీ)(sidbi latest news). ప్రత్యేక సామాజిక ప్రభావ రుణ కార్యక్రమం ద్వారా రూ.కోటి వరకు రుణాలు అందించనున్నట్లు తెలిపింది.

Sidbi, Google tie-up
గూగుల్​తో సిడ్బీ జట్టు

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా నిలిచేందుకు గూగుల్​ ఇండియాతో(sidbi google) భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్​ (సిడ్బీ) తెలిపింది(sidbi latest news). ఇందులో భాగంగా.. ఎంఎస్​ఎంఈలకు(sidbi msme loan) రూ.కోటి వరకు పోటీతత్వ వడ్డీ రేట్లతో ఆర్థిక సాయం అందించేందుకు సామాజిక ప్రభావ రుణ(sidbi msme loan) కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

కొవిడ్​-19 సంబంధిత సంక్షోభ స్పందన కింద సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 15 మిలియన్​ అమెరికా డాలర్ల(రూ.110 కోట్లు) కార్పస్​ నిధి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది సిడ్బీ(sidbi news). రుణ కల్పన కార్యక్రమం ముఖ్యంగా మైక్రో ఎంటర్​ప్రైజెస్​ (రూ.5 కోట్లలోపు టర్నోవర్​) సంస్థలను లక్ష్యంగా చేసుకుని చేపడుతున్నామని, రూ.25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు అందించనున్నట్లు వెల్లడించింది.

చిన్న పరిశ్రమలకు తమ మద్దతును విస్తరించేందుకోసమే సిడ్బీతో చేతులు కలిపినట్లు గూగుల్​ ఇండియా(Google India) ఉపాధ్యక్షుడు, మేనేజర్​ సంజయ్​ గుప్తా తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు నడిపే పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. అలాంటి వారికి వడ్డీ రేట్లలో రాయితీ ఇస్తామన్నారు.

ఇదీ చూడండి: 'సంపద, ఉద్యోగాలు సృష్టించే వారికి బ్యాంకులు మద్దతివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.