ETV Bharat / business

షేర్​చాట్ సూపర్​ హిట్- గంటకు 5 లక్షల డౌన్​లోడ్స్​

చైనా యాప్​ల నిషేధంతో దేశీయ యాప్​లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి యాప్​ల డౌన్​లోడ్స్​ గణనీయంగా పెరిగాయి. రెండురోజుల్లోనే 15 మిలియన్ల మంది యూజర్స్​ పెరిగినట్లు ప్రకటించింది షేర్​చాట్​. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు 10 రోజుల్లో ఐదున్నర లక్షల మంది వినియోగదారులు పెరిగారు.

ShareChat
చైనా యాప్​ల నిషేధంతో 'షేర్​చాట్​'కు భారీగా పెరిగిన ఆదరణ
author img

By

Published : Jul 1, 2020, 6:54 PM IST

చైనాకు చెందిన 59 యాప్​లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో.. వాటి వినియోగదారులు స్వదేశీ యాప్​లవైపు మళ్లుతున్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి దేశీయ యాప్​ల డౌన్​లోడ్స్, సైనప్స్​ భారీగా పెరిగాయి.

గత రెండు రోజుల్లో తమ యాప్​ డౌన్​లోడ్స్​లో ఊహించని వృద్ధి నమోదైనట్లు దేశీయ అతిపెద్ద ప్రాంతీయ భాషా సామాజిక మాధ్యమం షేర్​చాట్​ వెల్లడించింది. చైనా యాప్​లపై నిషేధం విధించినప్పటి నుంచి గంటకు 5 లక్షల మేర డౌన్​లోడ్స్​ అయ్యాయని, రెండు రోజుల్లో మొత్తం 15 మిలియన్ల మంది వినియోగదారులు పెరిగారని తెలిపింది.

"షేర్​చాట్​కు ప్రజల నుంచి వస్తోన్న ఆదరణ చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ ఆదరణ భారతీయ సామాజిక మాధ్యమాల్లో మేము అగ్రగామిగా నిలిచేలా చేస్తుంది. ఇది షేర్​చాట్​కు మరో విజయానికి పునాది వేస్తుందనే నమ్మకం ఉంది."

- ఫరీద్​ అహ్సాన్​​, షేర్​చాట్​ సీఓఓ, సహవ్యవస్థాపకుడు

చైనా యాప్​లను నిషేధించటంపై ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పటి వరకు ఒక లక్షకుపైగా పోస్టులు వచ్చాయని, వాటిని మిలియన్​కుపైగా వినియోగదారులు లైక్​ చేసినట్లు సంస్థ తెలిపింది. అందులో 5 లక్షలు వాట్సాప్​లోకి షేర్​ చేసినట్లు వెల్లడించింది.

రొపొసొ..

టిక్​టాక్​ వినియోగదారులు, అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్నవారు.. నిషేధం తర్వాత తమ యాప్​ను ఎంచుకుంటున్నట్లు షార్ట్​ వీడియో యాప్​ రొపొసొ తెలిపింది. టిక్​టాక్​లో 9.5, 9 మిలియన్​ ఫాలోవర్స్​ ఉన్న ప్రేమ్​ వాట్స్​, నూర్​ అఫ్సాన్​ వంటి వారు తమ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్నారని ప్రకటించింది. రొపొసొ.. 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండగా.. 14 మిలియన్ల మంది యూజర్స్​ ఉన్నారు. నెలకు 80 మిలియన్ల వీడియోలు పోస్ట్​ అవుతున్నాయి.

బాక్స్​ఎంగేజ్​.కామ్​

చైనా యాప్​లపై నిషేధం విధించిన 24 గంటల్లోనే 10 రెట్ల వృద్ధితో లక్షకుపైగా వినియోగదారులు పెరిగినట్లు బాక్స్​ఎంగేజ్​.కామ్​ తెలిపింది. లాక్​డౌన్​ విధించిన సమయంలోనే ఈ వెబ్​సైట్​ను ప్రారంభించారు. సమాచార గోప్యత సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతం వెబ్​సైట్​ను నడుపుతుండగా.. త్వరలోనే మొబైల్​ యాప్​ను తీసుకురానున్నట్లు తెలిపింది సంస్థ.

చింగారీ..

టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు ఆదరణ భారీగా పెరిగింది. 10 రోజుల్లో 5,50,000 డౌన్​లోడ్స్​ కాగా, మొత్తం డౌన్​లోడ్స్​ 20,50,000లకు చేరాయి.

ఇదీ చూడండి: చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.