ETV Bharat / business

'పేద దేశాల కోసం 10 కోట్ల కరోనా టీకా డోసులు' - Serum Institute to produce 100 million COVID-19 vaccine doses for low and middle-income countries

భారత్ సహా ఆర్థికంగా వెనుకబడిన దేశాల కోసం పది కోట్ల కొవిడ్ టీకా డోసులను అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు సీరమ్ సంస్థ ప్రకటించింది. ఈ టీకాల ఉత్పత్తికి.. గవి, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఈ టీకాలను సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.

serum-institute-of-india-to-produce-200-million-of-covid-19-vaccine
సీరం ఇన్​స్టిట్యూట్ పది కోట్ల డోసులు
author img

By

Published : Sep 29, 2020, 5:50 PM IST

కొవిడ్-19 టీకాలను పది కోట్ల డోసులు అదనంగా ఉత్పత్తి చేయనున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా వెల్లడించింది. భారత్ సహా ఆర్థికంగా వెనుకబడిన, అభివృద్ధి చెందని దేశాల కోసమే ఇలా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 100 మిలియన్ డోసుల కొవిడ్ టీకాల ఉత్పత్తి, సరఫరా కోసం ఆగస్ట్‌లో గవి, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వివరించింది సీరమ్.

వంద మిలియన్ డోసుల వ్యాక్సిన్ తయారీ కోసం... ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకాతో సీరమ్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. మిలిందా గేట్స్ ఫౌండేషన్-గవి ఒప్పందంతో మొత్తం 200 మిలియన్ డోసుల కరోనా టీకాలను ఉత్పత్తి చేయనున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఈ అదనపు డోసులను పేద దేశాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి- 'సరిహద్దుల్లో యుద్ధం లేదు, శాంతి లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.