ఆర్థిక, టెలికాం రంగాల్లో లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. బొంబయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 414 పాయింట్లు కోల్పోయి.. 33,957 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 121 పాయింట్ల నష్టంతో 10,047 వద్ద స్థిరపడింది.
హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 34,811 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,881 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 10,291 పాయింట్ల గరిష్ఠ స్థాయి.., 10,021 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మ, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ షేర్లు లాభాలతో ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టైటాన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇటీవల వరుస లాభాలతో దూసుకుపోయిన వొడాఫోన్ ఐడియా షేర్లు నేడు దాదాపు 16 శాతం నష్టాన్ని నమోదు చేశాయి.
రూపాయి..
కరెన్సీ మార్కెట్లో రూపాయి మంగళవారం 6 పైసలు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.75.61 వద్ద స్థిరపడింది.
ఇదీ చూడండి:ఆ చమురు సంస్థలో 10 వేల ఉద్యోగాలు కట్!