స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 521 పాయింట్ల లాభంతో 50,030 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 14,867 వద్దకు చేరింది.
అంతర్జాతీయ సానుకూలతలకు తోడు.. మార్చిలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూలవడం, వాహన విక్రయాలు పెరిగినట్లు గణాంకాలు వెలువడుతుండటం.. మార్కెట్లకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా ముగిశాయి. బ్యాంకింగ్, లోహ, వాహన రంగాలు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 50,064 అత్యధిక స్థాయిని; 49,478 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 14,883 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,692 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
హెచ్‌యూఎల్, నెస్లే, టీసీఎస్, టైటాన్, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే 30 షేర్ల ఇండెక్స్‌లో నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలూ లాభాలను గడించాయి.
ఇదీ చదవండి:జీఎస్టీ వసూళ్లలో ఆల్‌టైం రికార్డ్