అంతర్జాతీయ ప్రతికూలతలు, కేంద్రప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాల ప్రకటనకు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం వల్ల దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కరోనా మహమ్మారి ఇప్పడిప్పుడు ప్రపంచాన్ని విడిచిపెట్టదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కూడా దీనికి తోడయ్యాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ దశలోనూ మార్కెట్లు కోలుకోలేదు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 885 పాయింట్లు నష్టపోయి 31 వేల 122 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 240 పాయింట్లు కోల్పోయి 9 వేల 142 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో..
హీరో మోటోకార్ప్, ఎల్ అండ్ టీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, సన్‌ఫార్మా రాణించాయి.
ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సీ ట్విన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్ర, ఎన్టీపీసీ, ఎస్బీఐ నష్టపోయాయి.
ఇదీ చూడండి: రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!