ETV Bharat / business

ఆర్​బీఐ ప్రకటనతో జోష్​.. లాభాలతో ముగిసిన మార్కెట్లు - స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం

బ్యాంకింగ్ రంగ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 416 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 9,282 వద్ద స్థిరపడింది.

stocks markets today
స్టాక్ మార్కెట్ వార్తలు
author img

By

Published : Apr 27, 2020, 3:52 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఆరంభం నుంచే సానుకూలంగా స్పందించిన సూచీలు.. చివరి వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించాయి. మ్యూచువల్​ ఫండ్లకు అండగా ఆర్​బీఐ ప్రకటించిన రూ.50 కోట్ల ప్యాకేజీతో మదుపరుల సెంటిమెంట్ బలపడిందని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో లభించిన కొనుగోళ్ల మద్దతే ఈ లాభాలకు కారణంగా చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమందించేందుకు కేంద్రం కూడా భారీ ప్యాకేజీని ప్రకటిస్తుందన్న అంచనాలూ నేటి లాభాలకు మరో కారణమంటున్నారు విశ్లేషకులు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 416 పాయింట్లు బలపడి 31,743 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 128 పాయింట్లు పెరిగి 9,282 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 32,104 పాయింట్ల అత్యధిక స్థాయి, 31,651 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,377 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 9,250 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, నెస్లే ఇండియా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎం&ఎం షేర్లు నష్టాలతో ముగిశాయి.

రూపాయి..

రూపాయి నేడు 21 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 76.25 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:'మ్యూచువల్ ఫండ్స్'కు ఆర్​బీఐ భారీ ప్యాకేజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.