ETV Bharat / business

మార్కెట్ల కొత్త రికార్డు- 50,250 పైకి సెన్సెక్స్

author img

By

Published : Feb 3, 2021, 3:41 PM IST

Updated : Feb 3, 2021, 5:23 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 458 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠమైన 50,250పైకి చేరింది. నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో 14,800 మార్క్​కు చేరువైంది.

stocks close in new record level
మూడో రోజూ బుల్​ జోరు

వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. బుధవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్​ 458 పాయింట్లు బలపడి చరిత్రలో తొలిసారి 50,256 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 142 పాయింట్లకుపైగా పెరిగి జీవనకాల గరిష్ఠమైన 14,790 వద్దకు చేరింది.

బడ్జెటోత్సాహం, అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఫార్మా షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 50,526 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 49,515 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,868 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 14,574 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఇండస్​ఇండ్ బ్యాంక్, పవర్​గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్​, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ, టెక్​ మహీంద్రా షేర్లు ఎక్కువగా లాభాలను గడించాయి.

ఐటీసీ, మారుతీ, అల్ట్రాటెక్​ సిమెంట్, ఏషియన్​ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్​, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై మినహా.. టోక్యో, కోస్పీ, హాంకాంగ్ సూచీలు లాభాలను నమోదు చేశాయి.

50 వేల వరకు సెన్సెక్స్ ప్రయాణం..

1,000 పాయింట్లు

1990 జులై 25న తొలిసారి ఈ మార్క్​ను దాటింది సెన్సెక్స్. కార్పొరేట్ల ఫలితాలు ఆకర్షణీయంగా నమోదవటం, రుతుపవనాల సానుకూలతలు ఇందుకు కారణమయ్యాయి.

5000 పాయింట్లు

1999 అక్టోబర్​ 11న ఈ స్థాయిని దాటింది సెన్సెక్స్. 13వ లోక్​సభ ఎన్నికల్లో భాజపా కూటమి గెలుపొందటం ఇందుకు కలిసొచ్చింది.

10,000 పాయింట్లు

2006 ఫిబ్రవరి 6న ఈ స్థాయిని తాకింది. 10,000 మార్క్ ఎగువన స్థిరపడింది మాత్రం 2006 ఫిబ్రవరి 7.

15,000 పాయింట్లు

2007 జులై 6న తొలిసారి ఈ మార్క్​ను దాటింది. 14 వేల నుంచి ఈ స్థాయికి చేరేందుకు 143 సెషన్లు పట్టింది.

20,000 పాయింట్లు

2007 అక్టోబర్ 29న ఇంట్రాడేలో ఈ రికార్డును నెలకొల్పింది. 20 వేల మార్క్​పైన ముగియటం మాత్రం 2007 డిసెంబర్ 11నే తొలిసారి.

25,000 పాయింట్లు

2014 మేల 16న ఈ స్థాయిని తాకింది. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఇందుకు కలిసొచ్చింది. అయితే 25 వేల మార్క్​పైన సెన్సెక్స్ స్థిరపడింది మాత్రం 2014 జూన్​ 5న.

30,000 పాయింట్లు

రెపో రేటును తగ్గిస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకున్న కారణంగా 2015 మార్చి 4న తొలిసారి ఈ స్థాయిని అందుకుంది.

35,000 పాయింట్లు

2018 జనవరి 17న తొలిసారి ఈ మార్క్​పైన స్థిరపడింది సెన్సెక్స్​.

40,000 పాయింట్లు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 2019 మే 23న (ఉదయం 10:45 సమయంలో) తొలిసారి ఈ స్థాయిని దాటింది సెన్సెక్స్.

45,000 పాయింట్లు

2020 డిసెంబర్ 4న తొలిసారి ఈ రికార్డ్​ను నమోదు చేసింది. విదేశీ పెట్టుబడుల జోరు సహా కొన్ని నెలలుగా మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతుండటం ఇందుకు కారణం.

50,000 పాయింట్లు

ఈ ఏడాది జనవరి 21నే సెన్సెక్స్ తొలిసారి 50 వేల మార్క్ దాటింది. అయితే 50 వేల మార్క్​పై​ స్థిరపడటం మాత్రం బుధవారమే (2021 ఫిబ్రవరి 3) ప్రథమం

ఇదీ చదవండి:30 ఏళ్లు, 50 వేల పాయింట్లు.. సెన్సెక్స్​ ప్రస్థానం ఇలా..

Last Updated : Feb 3, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.