కొవిడ్ సెకండ్ వేవ్ భయాలు దేశాన్ని కుదిపేస్తున్నా స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మంగళవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 558 పాయింట్లు పెరిగి 48,944 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 168 పాయింట్ల లాభంతో 14,653 వద్దకు చేరింది.
నిర్మాణ, బ్యాంకింగ్ రంగాలు సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి హెవీ వెయిట్ షేర్ల సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,009 పాయింట్ల అత్యధిక స్థాయి, 48,399 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,667 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,484 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎల్&టీ, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాలను నమోదు చేశాయి.
మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, ఎం&ఎం నష్టపోయాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై మినహా నిక్కీ, కోస్పీ, హాంగ్ సెంగ్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.