ETV Bharat / business

'ఆటో' టాప్​ గేర్- సెన్సెక్స్ 466 పాయింట్లు ప్లస్ - సెన్సెక్స్

వారంలో మొదటి రోజు భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 466 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 156 పాయింట్లు వృద్ధి చెందింది. సోమవారం సెషన్​లో ఆర్జించిన లాభాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ సరికొత్త గరిష్ఠానికి చేరింది.

STOCKS MARKETS CLOSE IN PROFITS
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jul 6, 2020, 3:42 PM IST

వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 466 పాయింట్లు వృద్ధి చెంది 36,487 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 10,764 వద్ద స్థిరపడింది.

వాహన, లోహ, ఆర్థిక రంగ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. హెవీ వెయిట్ షేర్లు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ఆసియా మార్కెట్ల సానుకూలతలు కూడా లాభాలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.

లాభనష్టాల్లో..

ఎం&ఎం, బజాజ్​ ఫినాన్స్, మారుతీ, టీసీఎస్​, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం 3 శాతానికిపైగా బలపడ్డాయి. దీనితో సంస్థ ఎం-క్యాప్​ రూ.11.7లక్షల కోట్లు దాటింది.

బజాజ్ ఆటో, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్, హెచ్​యూఎల్, హెచ్​సీఎల్ టెక్ షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి.

రూపాయి విలువ..

కరెన్సీ మార్కట్​లో రూపాయి ఆరంభం సానుకూలంగా స్పందించినా.. చివరకు 2 పైసలు కోల్పోయి ఫ్లాట్​గా సెషన్ ముగించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.74.68 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఈ-వే బిల్లులే రుజువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.