ETV Bharat / business

ఆరంభంలో జోరు తగ్గినా.. ఐదో రోజూ ముందుకే - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 187 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 36 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసింది. వరుస లాభాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ సెషన్​లో కాస్త వెనక్కి తగ్గాయి.

STOCKS TODAY
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jul 7, 2020, 3:43 PM IST

Updated : Jul 7, 2020, 6:02 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు లాభాలతో ముగిశాయి. ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నా.. చివరి గంటలో నమోదైన కొనుగోళ్లతో ముందుకు దూసుకెళ్లాయి సూచీలు.

బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 187 పాయింట్లు వృద్ధి చెంది 36 వేల 674 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 10,800 వద్ద స్థిరపడింది.

ఆర్థిక, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 36,723 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,271 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 10,814 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 10,690 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్, బ్యాంక్, బజాజ్ ఫిన్​సర్వ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

పవర్​గ్రిడ్, ఐటీసీ, టాటా స్టీల్, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

వరుస లాభాలతో ఇటీవల రికార్డు స్థాయికి చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మంగళవారం కాస్త వెనక్కి తగ్గాయి.

ఆసియా మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై సూచీ లాభాలతో ముగిసింది. హాంకాంగ్, టోక్యో, సియోల్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి విలువ..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి 25 పైసలు కోల్పోయింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.74.93 వద్దకు చేరింది.

ఇదీ చూడండి:'కరోనాతో సవాళ్లే కాదు అవకాశాలూ పెరిగాయ్'

Last Updated : Jul 7, 2020, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.