ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్ల దన్నుతో రెండోరోజూ మార్కెట్ల జోరు - సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లలో మంగళవారమూ లాభాల జోరు కొనసాగింది. సెన్సెక్స్ 522 పాయింట్లు బలపడగా.. నిఫ్టీ 153 పాయింట్ల లాభంతో 10 వేల మార్క్​ను సమీపించింది.

stocks market news
స్టాక్ మార్కెట్​ వార్తలు
author img

By

Published : Jun 2, 2020, 3:52 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో వరుసగా రెండో రోజూ(మంగళవారం) భారీ లాభాలతో ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 522 పాయింట్లు పుంజుకుని 33,825 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 153 పాయింట్ల వృద్ధితో 9,979 వద్దకు చేరింది.

లాక్​డౌన్ సడలింపులో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న ఆశలు మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేసినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. వీటికి తోడు బ్యాంకింగ్, హెవీ వెయిట్​ షేర్లు అత్యధికంగా లాభపడటమూ మార్కెట్లకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 33,866 పాయింట్ల అత్యధిక స్థాయి, 33,301 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 9,985 పాయింట్ల గరిష్ఠ స్థాయి; 9,824 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

బజాజ్ ఫినాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి.

మారుతీ, ఐటీసీ, ఎన్​టీపీసీ, నెస్లే, హెచ్​యూఎల్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి బుధవారం 5 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.75.36 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:మోదీ పనితీరుపై రాహుల్​ 'మూడీస్​ పంచ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.