ETV Bharat / business

'ఆపరేషన్​ కశ్మీర్​'తో స్టాక్​మార్కెట్లు విలవిల

'ఆపరేషన్​ కశ్మీర్', అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావంతో దేశీయ స్టాక్​మార్కెట్లు కుప్పకూలాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 418 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 134 పాయింట్లు పతనమైంది. బ్యాంకింగ్, ఆర్థిక, లోహ రంగాలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

'ఆపరేషన్​ కశ్మీర్​'తో స్టాక్​మార్కెట్లు విలవిల
author img

By

Published : Aug 5, 2019, 5:01 PM IST

ఆపరేషన్​ కశ్మీర్, ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, బ్యాంకింగ్, ఆర్థిక, లోహ రంగాల్లో తీవ్రమైన అమ్మకాల కారణంగా దేశీయ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి.

ఓ దశలో 700 పాయింట్ల వరకు పతనమైన బీఎస్​ఈ సెన్సెక్స్ 37వేల మార్కును కోల్పోయింది. చివరకు 418 పాయింట్ల(1.13 శాతం) నష్టంతో 36 వేల 699 వద్ద ముగిసింది. జాతీయ​ స్టాక్​ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 134.75 పాయింట్లు (1.23 శాతం) తగ్గి 10 వేల 862.60 వద్ద స్థిరపడింది.

' ఆపరేషన్​ కశ్మీర్' ఎఫెక్ట్​

కేంద్రప్రభుత్వం సోమవారం జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్​ 370, ఆర్టికల్ 35ఎ లను రద్దు చేసింది. ఇది తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైంది. ఫలితమే దేశీయ స్టాక్​మార్కెట్ల భారీ పతనం.

తగ్గిన చైనా కరెన్సీ విలువ

300 బిలియన్​ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 10శాతం సుంకం విధించాలని అమెరికా నిర్ణయించింది. ట్రంప్​ సర్కారు నిర్ణయాన్ని తటస్థీకరించేందుకు చైనా తన కరెన్సీ విలువను తగ్గించిందనే అంచనాల మధ్య... డాలరుతో పోలిస్తే యువాన్​ 7.03కు పడిపోయింది.

రూపాయి విలువ

రూపాయి విలువ 90 పైసలు తగ్గి ఒక డాలరుకు మారకం విలువ రూ.70.50ల వద్ద ఉంది.

ముడిచమురు

ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధర 0.74 శాతం తగ్గింది. బ్యారెల్​ ధర 61.43 డాలర్లుగా ఉంది.

ఆసియా మార్కెట్లు

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావంతో ఆసియా మార్కెట్లయిన షాంఘై కాంపోజిట్​, హాంగ్​సెంగ్, నిక్కీ, కోస్పీ నష్టాలపాలయ్యాయి.

ఇదీ చూడండి: మోదీ, షాల సాహసం భేష్​: అడ్వాణీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.