ETV Bharat / business

లాభాలకు బ్రేక్​.. సెన్సెక్స్​ 2002 పాయింట్లు పతనం - నిప్టీ

స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయి నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 2,002 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 566 పాయింట్లు కోల్పోయింది. ఆర్థిక, వాహన, లోహ, ఐటీ రంగ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : May 4, 2020, 3:53 PM IST

స్టాక్ మార్కెట్లు ఇటీవలి వరుస లాభాలకు బ్రేక్​ చెబుతూ నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభమే నష్టాలను నమోదు చేసిన సూచీలు ఏ దశలోను కోలుకోలేదు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 2,002 పాయింట్లు కోల్పోయి 31,715 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 566 పాయింట్ల నష్టంతో 9,293 వద్దకు చేరింది.

భారీ నష్టాలతో సెషన్ ఆరంభంలోనే బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.5.15 లక్షల కోట్లు ఆవిరైంది.

నష్టాలకు కారణాలు..

దేశవ్యాప్త లాక్​డౌన్ పొడిగింపు, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నష్టాలకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు చైనాపై ఆగ్రహంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ..ఆ దేశంపై సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. ఈ ప్రతికూలతలన్నింటి నేపథ్యంలో ఇటీవల నమోదైన లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడ్డారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండటం కూడా మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిసినట్లు అభిప్రాయపడుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ నేడు 32,748 వద్ద సెషన్ ప్రారంభించింది (నేటి గరిష్ఠ స్థాయి కుడా ఇదే). 31,692 పాయింట్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ కూడా 9,533 పాయింట్ల అత్యధిక స్థాయి వద్ద సెషన్​ ప్రారంభించింది. 9,266 పాయింట్ల అత్యల్ప స్థాయికి పడిపోయింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

భారతీ ఎయిర్​టెల్ 3.49 శాతం, సన్​ఫార్మా 0.04 శాతం లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ రెండు కంపెనీలు మాత్రమే లాభాలను గడించాయి.

ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీలు అత్యధికంగా 10 శాతానికిపైగా నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఇండస్​ ఇండ్​ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ భారీ నష్టాలతో ముగిశాయి.

రూపాయి..

రూపాయి నేడు అత్యధికంగా 64 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.73 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:మాస్క్​ వినియోగంపై అంకురాల 'అప్నామాస్క్​' ట్రెండ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.