దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. లోహ, వాహన, ఇంధన, బ్యాంకింగ్, ఇన్ఫ్రా సహా కీలక రంగాలన్నీ రాణిస్తున్నాయి. ఫెడ్ సమావేశం, బ్రిటన్ ఎన్నికలు, అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం స్తబ్ధుగా ఉన్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడం గమనార్హం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 140 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 40 వేల 552 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 11 వేల 955 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
ఎస్ బ్యాంకు, యూపీఎల్, సిప్లా, టాటా మోటార్స్, వేదాంత, టాటా స్టీల్ రాణిస్తున్నాయి.
ఓఎన్జీసీ, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్ కార్ప్, ఐసీఐసీఐ బ్యాంకు, హెడ్‌డీఎఫ్‌సీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ లాభాల్లో ట్రేడవుతుండగా, షాంగై కాంపోజిట్ నష్టాల్లో కొనసాగుతోంది.
రూపాయి విలువ
రూపాయి విలువ స్వల్పంగా పెరిగి, ఒక డాలరుకు రూ.70.69గా ఉంది.
ఇదీ చూడండి: హిమాచల ప్రదేశం.. శ్వేతవర్ణ శోభితం