ఆరంభం అలా.. ముగింపు ఇలా
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో కాస్త సానుకూలంగా స్పందించినా.. మిడ్ సెషన్‌కు ముందు నుంచి నమోదైన లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్నాయి సూచీలు. చివరకు సెన్సెక్స్ 561 పాయింట్ల భారీ నష్టంతో 34,868 వద్ద స్థిరపడిది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 10,305 వద్దకు చేరింది.
ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, నెస్లే, టెక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్ షేర్లు లాభాలను ఆర్జించాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి.