స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ బుల్ జోరు కొనసాగింది. గురువారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 529 పాయింట్లు బలపడి 46,973 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 13,749 వద్ద స్థిరపడింది.
ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒకానొక దశలో స్వల్ప లాభాలకు పరిమితమైన సూచీలు.. ఆర్థిక, ఫార్మా, హెవీ వెయిట్ షేర్ల అండతో భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూలతలూ గురువారం లాభాలకు దన్నుగా నిలిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 47,053 పాయింట్ల అత్యధిక స్థాయి, 46,539 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,772 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 13,626 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్‌టెక్, నెస్లే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన స్టాక్ మార్కెట్లు అయిన షాంఘై మినహా.. టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలూ గురువారం లాభాలను గడించాయి.
ఇదీ చూడండి:వినియోగదారుల ఖాతా భద్రతకు కొత్త ఫీచర్లు: ఫేస్బుక్