యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, బ్యాంకింగ్, వాహనరంగ షేర్ల కొనుగోలు ఊపందుకోవడం వల్ల ఇవాళ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్ 83.88 పాయింట్లు లాభపడి (0.22 శాతం) 37 వేల 481 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 32.60 పాయింట్లు (0.29 శాతం) వృద్ధిచెంది 11 వేల 118 వద్ద స్థిరపడింది.
లాభాల్లోనివి...
ఎస్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, ఎస్బీఐ, కోటక్ బ్యాంకు (సుమారు 5.32 శాతం) లాభాలు ఆర్జించాయి.
నష్టాల్లోనివి...
యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఎన్టీపీసీ, మారుతీ, టెక్ మహీంద్ర, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నష్టాలపాలయ్యాయి.
విదేశీ మదుపర్లు ఇవాళ కూడా రూ.644.59 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారని స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా స్పష్టం చేస్తోంది.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు షాంఘై కాంపోజిట్, హాంగ్ సెంగ్, కోస్పి, నిక్కీ నష్టాలు చవిచూశాయి. యూరోపియన్ ఈక్విటీలు సైతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి..
రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోల్చితే రూ.68.84గా ఉంది.
పెరిగిన ముడిచమురు ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.82 శాతం పెరిగి బ్యారెల్ ధర 65.25 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: అఫ్గాన్‌లో బాంబు పేలుడు.. 34 మంది మృతి