ETV Bharat / business

విదేశీ మదుపర్ల రివర్స్ గేర్​- ఒడుదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు

దేశీయ స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల్లో నష్టాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణల ప్రభావమే ఇందుకు కారణం.

stock market today
విదేశీ మదుపర్ల రివర్స్ గేర్​- ఒడుదొడుకుల్లో స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Dec 9, 2019, 10:36 AM IST

ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల నష్టాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణల ప్రభావంతో..ఇవాళ దేశీయ స్టాక్​మార్కెట్లు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

నవంబర్ టోకు ధరల ద్రవ్యోల్బణం, అక్టోబర్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ వారం వెలువడనున్న దృష్ట్యా మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వొడాఫోన్​-ఐడియాకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్​పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 15 పాయింట్లు లాభపడి 40 వేల 460 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్లు వృద్ధిచెంది 11 వేల 925 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో

మారుతీ సుజుకి, జీ ఎంటర్​టైన్మెంట్​, వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో, హెచ్​డీఎఫ్​సీ, టాటా మోటార్స్, సన్​ఫార్మా రాణిస్తున్నాయి.

బజాజ్ ఫైనాన్స్, హెచ్​యూఎల్​, ఐటీసీ, టీసీఎస్​, యాక్సిస్​ బ్యాంకు, భారతీ ఇన్​ఫ్రాటెల్, ఎస్​ బ్యాంకు, ఎస్​బీఐ, గెయిల్, సిప్లా, కోటక్​ మహీంద్రా, టెక్​ మహీంద్రా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

క్రమంగా చైనా ఎగుమతులు క్షీణిస్తున్నా... అమెరికాలో భారీ ఎత్తున (2,66,000 ఉద్యోగాలు) ఉద్యోగ కల్పన ఆసియా మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ రాణిస్తున్నాయి. షాంగై కాంపోజిట్ మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది.

రూపాయి విలువ

రూపాయి విలువ 10 పైసలు పెరిగి, డాలరుకు రూ.71.10గా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర 0.33 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురుగా 64.18 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: కూరగాయలే తారాజువ్వలు...ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం

AP Video Delivery Log - 0400 GMT News
Monday, 9 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0352: New Zealand Volcano PM No access New Zealand 4243751
NZ PM: Tourists hurt, missing after volcano erupts
AP-APTN-0335: Japan North Korea No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4243749
Japan to 'vigilantly monitor' NKorea after test
AP-APTN-0247: Archive Juice WRLD Part must credit Billboard 4243744
Rapper Juice WRLD dies after medical emergency
AP-APTN-0242: Dominican Republic Ortiz AP Clients Only 4243743
Baseball's Ortiz in 1st appearance since shooting
AP-APTN-0223: Australia Wildfires No Access Australia 4243740
Firefighters try to tamp down blazes in Australia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.