స్టాక్ మార్కెట్లను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. నిన్న కాస్త తేరుకుని లాభాలు సాధించిన సూచీలు నేడు మళ్లీ నష్టాలను నమోదు చేశాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 28కి చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించడం మదుపరుల అప్రమత్తతకు కారణమైంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 214 పాయింట్ల నష్టంతో 38,409 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 49 పాయింట్లు క్షీణించి.. 11,254 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 38,792 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,846 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,357 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,082 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
ఇదీ చూడండి:కరోనా కట్టడికి ప్రపంచ బ్యాంకు ప్రత్యేక నిధి