ముడిచమురు ధరల పతనం.. మార్కెట్లకు నష్టాలు
ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తుండటం కారణంగా మదుపరుల్లో నెలకొన్న ఆందోళనలు, ముడిచమురు ధరల్లో 30 శాతం మేర క్షీణించడం కారణంగా స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1452 పాయింట్లు కోల్పోయి 36,124 వద్ద ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 406 క్షీణించి 10, 582 గా ట్రేడవుతోంది.
లాభనష్టాల్లో
ఎస్‌బ్యాంక్, హిందుస్థాన్ పెట్రోలియం, బీపీసీఎల్, స్పైస్ జెట్, ఎంఆర్‌పీఎల్, ఐఓసీఎల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్జీసీ, రిలయన్స్ ఇన్ఫ్రా, ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
రూపాయి క్షీణత
డాలరు మారకం విలువతో పోలిస్తే రూపాయి విలువ 30 పైసలు క్షీణించి 74 గా ఉంది.
ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. షాంఘై మార్కెట్ 2 శాతం, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు 3 శాతం, టోక్యో సూచీ 5 శాతం మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి.