ఫార్మా, ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఇన్ఫ్రా, లోహ రంగాల్లో కొనుగోళ్ల ఊతంతో స్టాక్‌మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ వారం మొదటి సెషన్ మంచి లాభాలతో ప్రారంభమైంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఆరంభ ట్రేడింగ్‌లో 250 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడైంది. ప్రస్తుతం.. 210 పాయింట్లు పెరిగి 37 వేల 562 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో ఉంది. 11 వేల 107 వద్ద కొనసాగుతోంది.
దేశీయంగా, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లాభాలకు ఓ కారణం. ఆసియా మార్కెట్లన్నీ మంచి ఫలితాల్ని సాధిస్తున్నాయి.
లాభనష్టాల్లోనివివే....
భారతీ ఇన్ఫ్రాటెల్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, టీసీఎస్, ఇండియాబుల్స్ హెచ్ఎస్జీలు పుంజుకున్నాయి. 3 శాతంపైగా లాభాలను నమోదుచేశాయి.
ఎస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, ఎస్బీఐ, టాటా స్టీల్, వేదాంత, ఓఎన్జీసీ, గెయిల్‌లు ఆరంభ ట్రేడింగ్‌లోనే డీలాపడ్డాయి.
రూపాయి...
నేడి ట్రేడింగ్‌లో రూపాయి స్వల్పంగా 8 పైసలు మెరుగుపడింది. డాలర్‌తో పోలిస్తే మారకం.. విలువ 71.06 వద్ద ఉంది.