ETV Bharat / business

'ట్రాయ్' నూతన​ ఛైర్మన్​గా పీడీ వాఘేలా - ట్రాయ్ ఛైర్మన్​గా పీడీ వాఘేలా

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్​) నూతన ఛైర్మన్​గా గుజరాత్​ కేడర్​ ​ఐఏఎస్​ అధికారి పీడీ వాఘేలా నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

P D Vaghela appointed TRAI chairman
'ట్రాయ్' నూతన​ ఛైర్మన్​గా పీడీ వాఘేలా
author img

By

Published : Sep 28, 2020, 10:34 PM IST

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్​) నూతన ఛైర్మన్​గా సీనియర్​ అధికారి పీడీ వాఘేలా నియామకమయ్యారు. ప్రస్తుతం ఛైర్మన్​ ఆర్​ఎస్​ శర్మ పదవీ కాలం ఈనెల 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ మేరకు నూతన ఛైర్మన్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది కేంద్రం.

మూడేళ్ల కాలం లేదా 65 ఏళ్ల వయసు వరకు(ఏదీ ముందు వస్తే అది) ట్రాయ్​ ఛైర్మన్​గా కొనసాగనున్నారు వాఘేలా.

వాఘేలా.. 1986 బ్యాచ్​ గుజరాత్​ కేడర్​ ఐఏఎస్​ అధికారి. ప్రస్తుతం ఫార్మాస్యూటికల్​ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుత ఛైర్మన్​ ఆర్​ఎస్​ శర్మ స్థానాన్ని భర్తీ చేయనున్నారు వాఘేలా. 2015లో ట్రాయ్​ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టారు శర్మ. అనంతరం 2018, ఆగస్టులో ఆయన పదవిని 2020, సెప్టెంబర్​ 30 వరకు పొడిగించింది కేంద్రం.

ఇదీ చూడండి: 'ఒకే దేశంపై ఆధారపడటం చాలా ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.