ETV Bharat / business

ఎయిర్​టెల్, వొడాఫోన్​కు భారీ షాక్

author img

By

Published : Jul 23, 2021, 11:08 AM IST

ఏజీఆర్​ బకాయిల కేసులో ఎయిర్​టెల్, వొడాఫోన్​-ఐడియాకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. బకాయిల లెక్కింపులో తప్పులు ఉన్నాయంటూ ఆ రెండు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

agr dues in sc
ఏజీఆర్ బకాయిలు- సుప్రీం కోర్టు

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​) లెక్కింపులో లోపాలు ఉన్నాయంటూ ఎయిర్​టెల్, వొడాఫోన్​-ఐడియా దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తేల్చిచెప్పింది.

ఏంటీ ఏజీఆర్​ వివాదం?
జాతీయ టెలికాం విధానం-1994 ప్రకారం టెలికాం రంగాన్ని సరళీకరించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటినుంచి సంస్థలకు లైసెన్సులను జారీ చేయటం మొదలుపెట్టింది. అంతకుముందు స్థిరమైన లైసెన్సు రుసుము ఉండేది.
1999లో ఆదాయ బదిలీ విధానానికి మారేందుకు టెలికాం విభాగం టెల్కోలకు అవకాశం ఇచ్చింది. దీని ప్రకారం టెల్కోల 'సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్​)'లోని కొంత మొత్తాన్ని వార్షిక లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్​ వినియోగ రుసుముగా ప్రభుత్వానికి చెల్లించాలి.

ఎంత చెల్లించాలి?

టెలికాం సంస్థలన్నీ కలిపి ఏజీఆర్​ బకాయిల కింద రూ.93,520 కోట్లు చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు గతేడాది సెప్టెంబర్​లో సుప్రీంకోర్టులో ఆయా సంస్థలకు పదేళ్లు గడువు ఇచ్చింది.

అయితే బకాయిల లెక్కింపులో తేడాలు ఉన్నాయని ఎయిర్​టెల్, వొడాఫోన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... నిరాశే మిగిలింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.