ఎస్ బ్యాంకులోని 245కోట్ల షేర్లను రూ.2450కోట్లకు దక్కించుకోనున్నట్లు తెలిపింది ఎస్బీఐ. ఒక్క షేరు విలువ రూ. 10గా ఉంది. బ్యాంకు పునర్విభజన తర్వాత ఈ షేర్లు 49శాతం వాటాగా బదిలీ అవుతాయని ఎస్బీఐ తెలిపింది.
ఎస్ బ్యాంకు నూతన బోర్డుకు సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్, నాన్ ఎక్జిక్యూటివ్ ఛైర్మన్, నాన్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారని స్పష్టం చేసింది ఎస్బీఐ. బ్యాంకు పునర్విభజన అనంతరం ఏడాది కాలం పాటు ఉద్యోగులు అదే జీతాలతో అదే హోదాలో కొనసాగుతారని పేర్కొంది.
పెట్టుబడులు పెట్టిన మూడేళ్ల వరకు వాటాల అమ్మకం ఉండదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా వాటాల అమ్మకం 26శాతం మించదని వెల్లడించింది.