ETV Bharat / business

క్యూ3లో 7% తగ్గిన ఎస్​బీఐ నికర లాభం

ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎస్​బీఐ నికర లాభం 7 శాతం క్షీణించి.. రూ.5,196.22 కోట్లుగా నమోదైంది. బ్యాంకుకు సంబంధించి నిరర్ధక ఆస్తుల విలువ కూడా తగ్గిందని ఎస్​బీఐ వెల్లడించింది.

SBI Q3FY21 standalone net profit falls 7 pc to Rs 5,196.22 cr, consolidated profit down 6 pc at Rs 6,402.16 cr.
క్యూ3లో క్షీణించిన ఎస్​బీఐ లాభాలు..
author img

By

Published : Feb 4, 2021, 2:31 PM IST

Updated : Feb 4, 2021, 3:18 PM IST

అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్​బీఐ నికర లాభం 2020-21 మూడో త్రైమాసికంలో 7 శాతం తగ్గింది. డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో స్టేట్​ బ్యాంక్ లాభం రూ.5,196.22 కోట్లుగా నమోదైంది. సరిగ్గా ఏడాది క్రితం రూ.5,583.86 కోట్లు ఆర్జించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.75,980.65 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది ఎస్​బీఐ. గతేడాది ఇదే సమయంలో రూ.76,797.91 కోట్లుగా ఉంది.

ఏకీకృత ప్రాతిపదికన ఈ ఆర్థిక ఏడాది త్రైమాసికంలో ఎస్​బీఐ సంబంధిత సంస్థల లాభం 5.8 క్షీణించి.. రూ.6,402.16 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో రూ.6,797.25 కోట్లుగా ఉంది.

2020 డిసెంబర్​ 31 నాటికి బ్యాంకుకు సబంధించిన నిరర్ధక ఆస్తుల విలువ 4.77శాతానికి తగ్గి.. రూ.1,17,244.23 కోట్లకు చేరింది. ఇది ఏడాది క్రితం 6.94శాతంతో రూ.1,59,661.19 కోట్లుగా ఉంది.

ఇదీ చదవండి: టీసీఎస్​ను వెనక్కినెట్టి మళ్లీ నెంబర్​వన్​గా రిలయన్స్​

Last Updated : Feb 4, 2021, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.