ETV Bharat / business

క్యూ3లో అదరగొట్టిన ఎస్​బీఐ.. 62శాతం లాభాలు - ఎస్​బీఐ క్యూ3 లేటెస్ట్ న్యూస్

SBI Q3 Results : 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అధిక లాభాలను గడించింది ఎస్​బీఐ. నికరలాభం 62శాతం వృద్ధి చెంది రూ. 8,432కోట్లు నమోదు చేసింది.

SBI
ఎస్​బీఐ
author img

By

Published : Feb 5, 2022, 3:34 PM IST

SBI Q3 Results 2022: అతిపెద్ద దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ క్యూ3లో 62శాతం లాభాలను గడించింది. నికరలాభం రూ. 8,432కోట్లు నమోదు చేసినట్లు వెల్లడించింది ఎస్​బీఐ. గతేడాది ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం రూ. 5,196 కోట్లుగా ఉంది.

"ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభంలో అత్యధికంగా అంటే 62శాతం వృద్ధి చెంది రూ. 8,432 కోట్లు నమోదు చేసింది." అని ఎస్​బీఐ పేర్కొంది. ఇదే సమయంలో బ్యాంకు ఆదాయం రూ. 78,352కు పెరిగిందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు ఆదాయం రూ. 75,981గా ఉందని పేర్కొంది.

బ్యాంకు నిరర్ధక ఆస్తుల విలువ 4.77 శాతం నుంచి 4.5శాతానికి క్షీణించిందిని వెల్లడించింది ఎస్​బీఐ.

క్యాపిటల్ ఎడెక్వసీ నిష్పత్తి(సీఏఆర్) 2021-22 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 13.23 శాతంగా ఉందని ఎస్​బీఐ తెలిపింది.

ఇదీ చూడండి: LIC market Value: ఎల్​ఐసీ రికార్డులు తిరగరాస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.