SBI Interest Rates: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బీఐ) రుణగ్రహీతలకు షాకిచ్చింది. ఎస్బీఐ బేస్ రేటును 0.1 శాతం పెంచింది. దీంతో వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఫలితంగా కొత్త వడ్డీ రేటు 7.55 శాతానికి చేరింది. బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును కూడా 12.2 నుంచి 12.3 శాతానికి సవరించింది. ఇవి బుధవారం (డిసెంబరు 15) నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ సమాచారాన్ని ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. ఈ కొత్త వడ్డీరేట్లు 2019 జనవరి నుంచి రుణాలు తీసుకున్నవారికి వర్తించవని ఎస్బీఐ తెలిపింది. అయితే అంతకుముందు తీసుకున్నవారికి వర్తిస్తాయని స్పష్టం చేసింది.
2019 జనవరి నుంచి ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును(ఈబీఎల్ఆర్) రెపో రేటుతో లంకె పెట్టింది. ఈబీఎల్ఆర్ రేటులో ఎటువంటి మార్పు ఉండదు. అయితే భారతీయ రిజర్వు బ్యాంకు బెంచ్‌మార్క్ వడ్డీ రేటులో మార్పు అనుగుణంగా ఈ రేటు మారుతూ ఉంటుంది.
వడ్డీ రేటు పెంపుపై ఎస్బీఐ బాటలోనే ఇతర బ్యాంకులు పయనించే అవకాశముంది.
ఇదీ చదవండి: వీటిలో పెట్టుబడి పెడితే.. ప్రభుత్వమే మీ డబ్బుకు హామీ!