ఒపెక్ ఒప్పందం విఫలమైన నేపథ్యంలో సౌదీ, గల్ఫ్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సౌదీ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 6.5 శాతం పడిపోయింది. గల్ఫ్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి.
చమురు దిగ్గజం సౌదీ అరాంకో షేర్లు మొదటిసారిగా తన ఐపీఓ ధర కంటే దిగువకు పడిపోయాయి. దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ 8.5 శాతం, కువైట్, అబుదాబి మార్కెట్లు 7.0 శాతానికి పైగా నష్టపోయాయి.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఒపెక్, దాని మిత్ర దేశాలు చమురు ఉత్పత్తి కోతపై ఒప్పందం కుదుర్చుకోవడానికి నిర్ణయించాయి. అయితే ఈ ప్రయత్నం విఫలమైంది.
ఇదీ చూడండి: ఈ కారు నడపడానికి మీకు లైసెన్స్ అవసరం లేదు!