ETV Bharat / business

ఇకపై ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్​కిన్ - మన్సుక్​ మాండవీయా

మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంచే దిశగా జన్​ ఔషధి కేంద్రాల్లో అమ్మే శానిటరీ న్యాప్​కిన్ల ధరను తగ్గించింది సర్కారు. కాలుష్య రహితమైన వీటిని రేపటి నుంచే అన్ని జన్​ ఔషధి కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుక్​ మాండవియా తెలిపారు.

ఇకపై ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్​కిన్
author img

By

Published : Aug 26, 2019, 5:12 PM IST

Updated : Sep 28, 2019, 8:22 AM IST

కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రతను పెంపొందిచేందుకు జన్​ ఔషధి కేంద్రాల్లో శానిటరీ న్యాప్​కిన్ల ధరను తగ్గించింది. కాలుష్యరహితమైన విటిని రేపటి నుంచే అన్ని జన్ ఔషధి కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్​ మాండవియా తెలిపారు.

ఇకపై ఒక్క రూపాయికే...

మహిళలకు మరింత అందుబాటులో చౌకగా దొరికేలా నాప్​కిన్ల ధరను 2రూపాయల 50 పైసల నుంచి 1 రూపాయికి తగ్గించింది. నాలుగు ప్యాడ్లతో కూడిన ఒక ప్యాక్​ ఇప్పటి వరకూ 10 రూపాయలకు విక్రయించేవారు. ఇకపై 4 రూపాయలకే లభించనున్నట్లు మంత్రి తెలిపారు. న్యాప్​కిన్లను సువిధా బ్రాండ్​ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న 5వేల 500 జన్​ ఔషధి కేంద్రాల్లో విక్రయించనున్నట్లు పేర్కొన్నారు.

గతేడాది జన్​ ఔషధి కేంద్రాల ద్వారా దాదాపు 2 కోట్ల 20 లక్షల న్యాప్​కిన్లు కొనుగోలు అయ్యాయని, ధర తగ్గించినందున వీటి వినియోగం మరింత పెరిగి అమ్మకాలు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఇదీ చూడండి:బంగారం ధర కొత్త రికార్డ్... నేడు ఎంత పెరిగిందంటే!

Intro:Body:

v

Conclusion:
Last Updated : Sep 28, 2019, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.