ETV Bharat / business

Samsung: గెలాక్సీ సిరీస్​ నుంచి రెండు కొత్త ట్యాబ్​లు! - శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్స్​

శాంసంగ్​(Samsung) సంస్థ గెలాక్సీ సిరీస్​ నుంచి మరో రెండు ట్యాబ్​లను విడుదల చేసింది. జూన్​ నుంచి ఎస్​7 ఎఫ్​ఈ, ఏ​7 లైట్​ మోడల్ ట్యాబ్స్​ అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో పేర్కొంది.

శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్స్​, Galaxy Tab S7 FE
మార్కెట్లోకి శాంసంగ్​ గెలాక్సీ ఎస్​7 ఎఫ్​ఈ, ఏ7 లైట్​!
author img

By

Published : May 29, 2021, 6:42 PM IST

గెలాక్సీ(Galaxy) సీరిస్​తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న శాంసంగ్(Samsung)​ తాజాగా మార్కెట్​లోకి కొత్త ట్యాబ్​లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ ట్యాబ్​ ఎస్​7 ఎఫ్​ఈ(Galaxy Tab S7 F), గెలాక్సీ ట్యాబ్​ ఏ7 లైట్(Galaxy Tab A7 Lite)​లను విపణిలోకి విడుదల చేసింది. వినోదంతో పాటు మల్టీటాస్కింగ్​లకు పెద్ద పీట వేస్తూ ఈ ట్యాబ్​లను డిజైన్​ చేసినట్లు పేర్కొంది.

ఎస్​7 ఎఫ్​ఈ ఫీచర్లు..

  • ఎస్​7 ఎఫ్​ఈ మోడల్​కు శాంసంగ్​ 12.4 ఇంచ్​ భారీ డిస్​ప్లేను అందిస్తోంది.
  • ఈ ట్యాబ్​ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఒకదానికి 4జీబీ ర్యామ్​ 64 జీబీ స్టోరేజ్​ ఉండగా.. మరొకటి 6 జీబీ ర్యామ్ 126 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​తో​ అందుబాటులో ఉంటుంది. ఈ స్టోరేజ్​​ను మైక్రోఎస్​డీ కార్డ్​ సాయంతో 1టెరా బైట్​ వరకు పెంచుకోవచ్చు.
  • ఆండ్రాయిడ్​ 11, ఆక్టాకోర్​ ప్రాసెసర్​తో నడిచే ఈ ట్యాబ్​ బ్యాటరీ సామర్థ్యం 10,090 ఎంఏహెచ్​
  • ఈ ఎస్​7 ఎఫ్​ఈ ఫ్రంట్​ కెమేరా 5 మెగాపిక్సల్స్​, రేర్​ కెమేరా 8 మెగాపిక్సల్స్​.

ఏ7 లైట్..

  • 8.7 ఇంచ్​ స్క్రీన్ ఉండే ఏ7 లైట్​కి డాల్బై అట్మస్​ సదుపాయం ఉన్న డ్యూయల్​ స్పీకర్స్​ అందుబాటులో ఉంటాయి.
  • 3 జీబీ , 4 జీబీ ర్యామ్​ వేరియంట్లలో లభించే ఈ ట్యాబ్​ గ్రే, సిల్వర్​ రంగులలో మార్కెట్లోకి రానుంది.

జూన్​ నుంచి ఈ ట్యాబ్​లు అందుబాటులో ఉంటాయని శాంసంగ్​ వెల్లడించింది.

ఇదీ చదవండి : ఆ సంస్థ ఉద్యోగులకు ప్రత్యేక కొవిడ్ బీమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.