ETV Bharat / business

రూపాయికి కరోనా దెబ్బ- 82 పైసలు పతనం - రూపాయి విలువ

కరోనా భయాలతో రూపాయి విలువ క్రమంగా పడిపోతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ రూపాయి మారకం విలువ 82 పైసలు క్షీణించింది.

rupee
రూపాయి
author img

By

Published : Mar 12, 2020, 10:55 AM IST

కరోనా భయాల నేపథ్యంలో రూపాయి విలువ గురువారం భారీగా పడిపోయింది. ప్రారంభ సెషన్​లోనే 82 పైసలు క్షీణించిన రూపాయి అమెరికా డాలరులో పోలిస్తే 74.50కు చేరుకుంది.

కరోనా వైరస్​ను అంతర్జాతీయ వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. ఫలితంగా ఆర్థిక మందగమనంపై కరోనా భయాలు మరింతగా పెరిగాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. వైరస్ తీవ్రత కారణంగా బ్రిటన్​ మినహా ఐరోపా దేశాలన్నింటికీ 30 రోజుల పాటు రాకపోకలు నిలిపేశారు. ఇది కూడా ప్రతికూల ప్రభావం చూపింది.

స్టాక్​ మార్కెట్ల పతనమూ..

ఈ పరిణామాలన్నీ రూపాయి పతనానికి కారణమని ఫారెక్స్​ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. దీనితో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమవటం, విదేశీ నిధులు తరలిపోవటం వల్ల రూపాయి బలహీనపడిందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో 0.27 శాతం బలహీనపడిన అమెరికా డాలరు, చమురు ధరలు 6 శాతం క్షీణతతో మద్దతు లభించినా.. రూపాయి మారకంపై కరోనా భయాలు భారీగా ప్రభావం చూపాయి.

4,200 మంది మృతి..

చైనా వుహాన్​లో మొదలైన కరోనా వైరస్​.. ప్రపంచంలోని 107 దేశాలకు విస్తరించింది. వైరస్​ కారణంగా ఇప్పటికీ వరకు ప్రపంచవ్యాప్తంగా 4,200 మంది చనిపోయారు. మరో 1,17,330 మంది వైరస్ బారిన పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.