ETV Bharat / business

"నూతన ఎఫ్​డీఐ నిబంధనలపై విశ్లేషిస్తున్నాం" - విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

భారత్​లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ-కామర్స్​ రంగంలో దూమారం రేపుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లు, ఎక్స్​క్లూజివ్​ విడుదలతో ఆకట్టుకుంటున్న సంస్థలు ఈ నిబంధనల ప్రభావాన్ని అంచనా వేస్తున్నాయి.

అమెజాన్​
author img

By

Published : Feb 3, 2019, 2:59 PM IST

భారత్​లో ఈ-కామర్స్​ సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఎఫ్​డీఐ నిబంధనల వల్ల తలెత్తే పరిణామాలను విశ్లేషిస్తున్నామని అమెజాన్​ తెలిపింది. విక్రయదారులు, వినియోగదారులపై ప్రతికూల ప్రభావం లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అమెజాన్​ సీఎఫ్​ఓ ప్రకటించారు. అన్ని నిబంధనలు, చట్టాలను ప్రకటిస్తామని తెలిపారు.

నూతన నిబంధనలివే...

నూతన నిబంధనల ప్రకారం... విదేశీ పెట్టుబడులున్న ఈ-కామర్స్​ సంస్థ, తన పెట్టుబడులున్న విక్రయదారు ఉత్పత్తులను అమ్మటానికి వీలులేదు. దీనితో పాటు ఎక్స్​క్లూజివ్​ ఒప్పందాలు కూడా నిషేధం. ఒకే సంస్థ 25 శాతం కంటే ఎక్కువ అమ్మకాలు తన ప్లాట్​ఫామ్​ ద్వారా జరిపినట్లయితే ఈ విక్రయదారును ఈ-కామర్స్​ సంస్థ నియంత్రణలో ఉన్నదానిగా పరిగణిస్తారు.

ఈ నిబంధనల ప్రకారం అమెజాన్​ తన పోర్టల్​ నుంచి క్లౌడ్​టేల్​, అప్పారియోలను తొలగించింది.

ఈ-కామర్స్​ సంస్థలు ఒప్పందాలు, విదేశీ పెట్టుబడులతో భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయని, దీనితో నష్టపోతున్నామని చిన్న సంస్థలు గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.