ETV Bharat / business

'కెయిర్న్‌కు రూ.10,500 కోట్లు చెల్లించండి' - కెయిర్స్ ఎనర్జీ పన్ను కేసులో ఆర్బిట్రేషన్ తీర్పు

రెట్రోస్పెక్టివ్‌ పన్ను కేసులో భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీచేసింది. బ్రిటన్​ సంస్థ కెయిర్న్ ఎనర్జీకి దాదాపు రూ.10,500 కోట్ల వరకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఆర్బిట్రేషన్‌ తీర్పును పూర్తిగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

Retro Tax Arbitration: India ordered to pay up to $1.4 bn to Cairn Energy
'కెయిర్న్‌కు రూ.10,500 కోట్లు చెల్లించండి'
author img

By

Published : Dec 24, 2020, 6:34 AM IST

రెట్రోస్పెక్టివ్‌ (వెనకటి తేదీ నుంచి విధించిన) పన్ను వివాదంలో భారత ప్రభుత్వంపై బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ విజయం సాధించింది. ఈ కేసులో కెయిర్న్‌ ఎనర్జీకి 1.4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10,500 కోట్ల) వరకు చెల్లించాల్సిందిగా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్‌) ట్రైబ్యునల్‌ తీర్పునిచ్చింది. బ్రిటన్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని ఈ పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ 582 పేజీల తీర్పులో పేర్కొంది. కెయిర్న్‌ నుంచి పన్నుమొత్తం వసూలు కోసం విక్రయించిన షేర్లు, నిలిపివేసిన డివిడెండ్లు, పన్ను రిఫండ్లను భారత ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిందిగా ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

ఆర్బిట్రేషన్‌ తీర్పును పూర్తిగా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్బిట్రేషన్‌ తీర్పుతో కెయిర్న్‌ పలు దేశాల్లో కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌ ఈ మొత్తాన్ని చెల్లించకుంటే, దేశ ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోరవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత 3 నెలల్లో రెట్రోస్పెక్టివ్‌ పన్ను కేసుల్లో భారత్‌కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. సెప్టెంబరులో రూ.22,100 కోట్ల రెట్రోస్పెక్టివ్‌ పన్ను వివాదంలో భారత ప్రభుత్వంపై వొడాఫోన్‌ గ్రూప్‌ పీఎల్‌సీ గెలిచింది.

ఇదీ జరిగింది..

భారత్‌లో వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మూలధన లాభాలు గడించిందన్న ఆరోపణలతో 2015 మార్చిలో రూ.10,247 కోట్ల పన్ను నోటీసులను కెయిర్న్‌ ఎనర్జీకి ప్రభుత్వం పంపింది. 2010-11లో కెయిర్న్‌ ఇండియాను వేదాంతాకు కెయిర్న్‌ ఎనర్జీ విక్రయించింది. అనంతరం సంస్థలో తక్కువ వాటాను అట్టేపెట్టుకుంది. అయితే రెట్రోస్పెక్టివ్‌ పన్నుల రికవరీ కోసం వేదాంతాలో కెయిర్న్‌కు ఉన్న 5% వాటాను ప్రభుత్వం విక్రయించింది. వాటాదార్లకు చెల్లించాల్సిన రూ.1140 కోట్ల డివిడెండ్‌లను జప్తు చేసింది. రూ.1590 కోట్ల పన్ను రిఫండ్లను సైతం చెల్లించలేదు.

తాజాగా అర్బిట్రేషన్‌ తీర్పులో 1.2 బిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని వడ్డీ, ఖర్చులతో పాటు చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో 200 మిలియన్‌ డాలర్ల వడ్డీ, 20 మిలియన్‌ డాలర్ల ఆర్బిట్రేషన్‌ వ్యయాలతో భారత్‌ 1.4 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:దేశీయంగా న్యుమోనియా టీకా- త్వరలో అందుబాటులోకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.