ETV Bharat / business

ప్రీ పెయిడ్​ వినియోగదారులకు శుభవార్త.. వ్యాలిడిటీ పొడిగింపు

author img

By

Published : Mar 31, 2020, 5:41 AM IST

టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ-ట్రాయ్ సూచనల మేరకు బీఎస్​ఎన్​ఎల్​, ఎయిర్​టెల్​ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తమ ప్రీ పెయిండ్‌ మొబైల్ యూజర్ల సేవలకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీ పొడిగించేందుకు అంగీకరించాయి. ఇన్​కమింగ్​ కాల్స్​ అందుకునేందుకు వీలుగా ఉచితంగా 10 రూపాయల టాక్​టైంనూ అందించనున్నట్లు పేర్కొన్నాయి.

Relief for users: BSNL, MTNL to extend prepaid validity up to April 20, offer Rs 10 additional talktime
ప్రీ పెయిడ్​ వినియోగదారులకు శుభవార్త.. వ్యాలిడిటీ పొడిగింపు

లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న తమ ఖాతాదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త ప్రకటించింది. గతవారం కాలపరిమితి ముగిసిన ఖాతాదారులకు ఏప్రిల్ 20 వరకు వ్యాలిడిటీని పొడిగిస్తూ ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తిగా ఉచితమని పేర్కొంది. వినియోగదారులు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకునేందుకే ఈ కాలపరిమితిని పొడిగించినట్టు వివరించింది.

జీరో బ్యాలెన్స్‌కు చేరుకున్న వినియోగదారులకు ఉచితంగా పది రూపాయల విలువైన టాక్‌టైంను కూడా అందిస్తున్నట్టు తెలిపింది.

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలకు 'ట్రాయ్‌' చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది బీఎస్​ఎన్​ఎల్​.

ఎయిర్​టెల్​ కూడా...

భారతీ ఎయిర్‌టెల్ కూడా బీఎస్ఎన్ఎల్​నే అనుసరించింది. దేశవ్యాప్తంగా తమకు ఉన్న 80 మిలియన్ల మంది ప్రీపెయిడ్ ఖాతాదారుల వ్యాలిడిటీ గడువును వచ్చే నెల 17 వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది ఎయిర్​టెల్​. ప్రకటించిన గడువు వరకు నిరంతరాయంగా ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవచ్చని తెలిపింది. దీనికి అదనంగా 10 రూపాయల టాక్‌టైమ్‌ను అందించనున్నట్టు వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందుతాయని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.