ETV Bharat / business

జియోకు భారీగా పెరిగిన కొత్త యూజర్లు- స్పెక్ట్రం బకాయిలు చెల్లింపు - ఎయిర్​ టెల్​ చందాదారులు

jio subscribers in india: దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్​గా రిలయన్స్ జియో నిలిచింది. నవంబర్​లో ఏకంగా 20.19 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది జియో. ఎయిర్‌టెల్​ సైతం తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఇక వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కూడా చెల్లించింది జియో.

jio
జియోకు భారీగా పెరిగిన కొత్త యూజర్లు
author img

By

Published : Jan 19, 2022, 8:52 AM IST

Updated : Jan 19, 2022, 12:25 PM IST

jio subscribers in india: ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో మరోసారి పెద్ద సంఖ్యలో చందాదారులను తన ఖాతాలో వేసుకుంది. నవంబర్​లో ఏకంగా 20.19 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది చందాదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు నవంబర్​ నెలకు సంబంధించిన సబ్‌స్క్రైబర్ల డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ విడుదల చేసింది.

నవంబర్​కు గాను ఎయిర్‌టెల్‌లో కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరారు. దీంతో ఆ కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య మరింత పెరిగింది. ఇదే సమయంలో వొడాఫోన్‌ ఐడియా 18.97 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. దీంతో ఆ కంపెనీ వైర్‌లెస్‌ చందాదారుల సంఖ్య 26.71 కోట్లుగా నమోదైంది. అలాగే, దేశంలో మొత్తం టెలిఫోన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 119.1 కోట్లకు చేరినట్లు ట్రాయ్‌ తెలిపింది.

రూ.30,791 కోట్ల స్పెక్ట్రం బకాయిలు చెల్లించిన జియో

స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించినట్లు టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో తెలిపింది. మార్చి 2021కి ముందు జరిగిన స్పెక్ట్రం వేలానికి సంబంధించి వడ్డీతో సహా అన్ని బకాయిలను చెల్లించేసినట్లు పేర్కొంది. 2014, 2015, 2016లో జరిగిన వేలంలో జియోకు స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయి. అలాగే 2021లో భారతి ఎయిర్‌టెల్‌తోనూ స్పెక్ట్రం వినియోగానికి సంబంధించి ఓ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా కంపెనీ 585.3 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రం సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు చెల్లింపులు చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న వడ్డీరేటు ప్రకారం.. కంపెనీకి ఏటా రూ.1,200 కోట్లు మిగలనున్నాయని పేర్కొంది. వాస్తవానికి ఈ చెల్లింపులపై కేంద్రం నాలుగేళ్ల మారటోరియం వెసులుబాటు కల్పించింది. కానీ, జియో ఆ సదుపాయాన్ని వినియోగించుకోకుండానే చెల్లింపులు చేసేసింది.

గతనెల భారతీ ఎయిర్‌టెల్‌ సైతం స్పెక్ట్రానికి సంబంధించి రూ.15,519 కోట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాంకు చెల్లించింది. ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌), టాటా టెలీసర్వీసెస్‌ , టాటా టెలీసర్వీసెస్‌ మహారాష్ట్ర మాత్రం ప్రభుత్వం కల్పించిన మారటోరియం సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చాయి. పైగా బకాయిలపై వడ్డీ కింద ప్రభుత్వానికి ఈక్విటీ వాటా ఇస్తామని ప్రకటించాయి. వీఐఎల్‌ 35.8 శాతం, టీటీఎస్‌ఎస్‌, టీటీఎంఎల్‌ కలిసి 9.5 శాతం ఈక్విటీ వాటాలను సర్కార్‌కు ఇస్తామని ప్రతిపాదించాయి.

ఇదీ చూడండి: రోబోలపై రిలయన్స్​ గురి.. రూ.983 కోట్ల పెట్టుబడులు

Last Updated : Jan 19, 2022, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.