మార్చి నెలలో జియో సంస్థకు(reliance jio) 79.18 లక్షల మంది మొబైల్ యూజర్లు పెరిగారని ట్రాయ్ శుక్రవారం వెల్లడించింది. ప్రత్యర్థులైన ఎయిర్టెల్, ఐడియా కన్నా ఇదే అధికమని పేర్కొంది. అదే నెల ఎయిర్టెల్కు కొత్తగా 40.5 లక్షల మంది యూజర్లు, వొడాఫోన్ ఐడియాకు 10.8 లక్షల మంది యూజర్లు పెరిగారు.
మార్చి నెలలో వచ్చిన కొత్త యూజర్లతో.. జియో వినియోగదారుల సంఖ్య(reliance jio users ) 42.9 కోట్లకు చేరగా, ఎయిర్టెల్కు 35.23 కోట్ల మంది, ఐడియా వొడాఫోన్కు 28.37 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య మార్చి నెలాఖరు నాటికి 120.1 కోట్లకు చేరిందని ట్రాయ్ వెల్లడించింది. నెలకు 1.12 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. మార్చి నెలలో అర్బన్ ప్రాంతాల్లో 0.97 వృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో 1.37 వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : Gautam Adani: ఒక్క వారంలో రూ.లక్ష కోట్లు లాస్!