చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ రెడ్‌మీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. రెడ్‌మీ కే-30 ప్రో పేరుతో 5జీ మోడల్‌ను చైనా మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. స్థానికంగా జరిగిన ఓ ఆన్‌లైన్ ఈ వెంట్‌లో ఈ మోడల్‌ను విడుదల చేసింది.
రెడ్‌మీ కె-30 ప్రో ప్రత్యేకతలు ఇవే..
- 6.67 అంగుళాల ఫుల్హెచ్డీ, సూపర్ అమోలెడ్ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (64 ఎంపీ+5ఎంపీ+13ఎంపీ+2ఎంపీ)
- 20 ఎంపీ పాప్‌ఆప్ సెల్ఫీ కెమెరా
- 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ
- 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ (30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జింగ్)
- ఆండ్రాయిడ్ 10తో పనిచేసే ఎంఐయూఐ 11 ఓఎస్
ధరలు ఇలా..
చైనా మార్కెట్లో ఈ మోడల్ 6జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ ఇలా మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరలు వరుసగా 2,999 యువాన్లు (రూ.32,300), 3,399 యువాన్లు (రూ.36,600), 3,699 యువాన్లు (రూ.39,900)గా నిర్ణయించింది.
జూమ్ ఎడిషన్..
ఇదే మోడల్ జూమ్ ఎడిషన్ తీసుకువచ్చింది షియోమీ. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ల ధరలు 8 జీబీ+128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 3,799 యువాన్లు (రూ.40,999), 8జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 3,399 యువాన్లుగా (రూ.42,999) నిర్ణయించింది.
అయితే భారత మార్కెట్లోకి ఈ మోడల్ ఎప్పుడు రానుంది అనే విషయంపై షియోమీ ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది.