ETV Bharat / business

స్టాక్ ​మార్కెట్లను కుదిపేస్తున్న భయాలు ఇవే - స్టాక్ మార్కెట్లు లేటెస్ట్​

దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతల కారణంగా స్టాక్​మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. స్టాక్ ​మార్కెట్లు ఎంత మేర నష్టాలను నమోదు చేశాయి? వాటికి కారణాలేంటి?

stocks markets crisis
స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణాలు
author img

By

Published : Mar 12, 2020, 8:25 PM IST

గత మూడు వారాల నుంచి స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. మదుపరుల్లో నెలకొన్న భయాలతో మార్కెట్లు ఈ స్థాయిలో నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. వీటికి గల కారణాలు సంక్షిప్తంగా మీ కోసం.

నేటి నష్టం..

  • సెన్సెక్స్​ 2,919 పాయింట్లు పతనమై..32,778 వద్ద స్థిరపడింది.
  • నిఫ్టీ 868 పాయింట్ల నష్టంతో 9,590కు చేరింది.
  • నేటి నష్టాలతో బీఎస్​ఈ మదుపరుల సంపద రూ.11 లక్షల కోట్లు ఆవిరి
  • బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల పూర్తి సంపద ప్రస్తుతం రూ.1,25,86,398.07 కోట్లు

మదుపరుల భయాలకు కారణాలు..

  • బ్రిటన్​ మినహా ఐరోపా దేశాల రాకపోకలపై 30 రోజుల నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన
  • చమురు ఉత్పత్తి దేశాల మధ్య ఉత్పత్తి తగ్గించే ఒప్పందం కుదరక.. క్రూడ్ ధరలు రికార్డు స్థాయిలో పడిపోవడం
  • కరోనా వైరస్​ను అంతర్జాతీయ మహమ్మారిగా గుర్తిస్తూ డబ్ల్యూహెచ్​ఓ చేసిన ప్రకటన
  • ఆసియా సహా అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లన్నీ భారీగా పతనమవ్వడం
  • జర్మనీ జనాభాలో 70 శాతం మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆ దేశ ఛాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​ ప్రకటన చేయడం
  • ఇటలీ సహ పలు ఇతర దేశాల్లో రోజు రోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటం
  • ఆర్థిక వృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలు
  • కీలక స్థాయి నుంచి సూచీలు మరింత కిందికి దిగజారడం కారణంగా మదుపరుల్లో ఆందోళనలు మొదలై మిడ్​ సెషన్ తర్వాత అమ్మకాలపై దృష్టి సారించడం.

ఇదీ చూడండి:కరోనా దెబ్బకు స్టాక్​ మార్కెట్ల 'లెక్కలు' తారుమారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.