ETV Bharat / business

డియర్​ ప్యాసింజర్స్.. వెల్​కమ్.! రతన్ టాటా స్పెషల్ మెసేజ్ - ఎయిరిండియా వెల్​కమ్​ నోట్​

Ratan Tata Welcomes Air India Passengers: ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా సన్స్​ ఛైర్మన్​ రతన్​ టాటా స్వాగతం పలికారు. ప్రయాణికుల సేవల్లో, సౌకర్యంలో రాజీపడబోమని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వాయిస్​ మెసేజ్​ను ఎయిరిండియా ట్విట్టర్​ పోస్ట్ చేసింది.

Ratan Tata, Air India
రతన్​ టాటా
author img

By

Published : Feb 2, 2022, 2:35 PM IST

Ratan Tata Welcomes Air India Passengers: దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి పుట్టినింటికి చేరుకుంది. గతవారం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది. ఈ సంస్థ టాటా గ్రూప్‌నకు బదిలీ అయిన తర్వాత టాటా సన్స్‌ గౌరవ ఛైర్మన్‌, టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా తొలిసారిగా స్పందించారు. ఎయిరిండియా ప్రయాణికులకు సాదర స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్‌ పంపారు.

'ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా గ్రూప్‌ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. ప్రయాణికుల సౌకర్యం, సేవల పరంగా విమానయానం అంటే ఎయిరిండియానే అనేలా సంస్థను తీర్చిదిద్దేలా పని చేసేందుకు సంతోషంగా ఉన్నాం' అని టాటా ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రత్యేక ఆడియో సందేశాన్ని ఎయిరిండియా ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించింది. ఈ బిడ్డింగ్‌లో టాటా సన్స్‌ అనుబంధ కంపెనీ అయిన టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విజేతగా నిలిచినట్లు గతేడాది అక్టోబరులో కేంద్రం ప్రకటించింది. అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత జనవరి 27న ఎయిరిండియాను అధికారికంగా టాటా గ్రూప్‌ చేతుల్లో పెట్టారు. ఎయిరిండియాకు చెందిన 100 శాతం షేర్లను టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ అయిన టాలెస్‌ ప్రై.లి.కు బదిలీ చేయడంతో పాటు, యాజమాన్య నియంత్రణ కూడా అప్పగించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: Tesla recall: రెడ్ లైట్ పడినా ఆగని 'టెస్లా'- 54వేల కార్లు రీకాల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.