ETV Bharat / business

రైల్వే ఒప్పంద కార్మికులకు 'శ్రామిక్ పోర్టల్' అండ! - రైల్వే ఒప్పంద కార్మికుల కనీస వేతనాలు

కనీస వేతనాల హామీ అమలుకు ఏర్పాటు చేసిన పోర్టల్ సహకారంతో రైల్వే ఒప్పంద కార్మికులకు రూ.3,459 కోట్ల వేతనాలు చెల్లించినట్లు ఆ శాఖ తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా కనీస వేతనాలు కార్మికులకు అందుతున్నదీ లేనిదీ తనిఖీ చేయడానికి వీలువుతున్నట్లు వెల్లడించింది.

Railways ensures 100% minimum wage payment to contract workers
రైల్వే ఒప్పంద కార్మికులకు 'శ్రామిక్ పోర్టల్' అండ!
author img

By

Published : Mar 12, 2021, 6:39 AM IST

రైల్వేలో ఒప్పంద కార్మికులకు కనీస వేతనాల హామీ అమలుకు ఏర్పాటు చేసిన పోర్టల్ సహకారంతో రెండేళ్లలో రూ.3,459 కోట్ల వేతనాలు చెల్లించినట్లు రైల్వేశాఖ గురువారం తెలిపింది.

2018 అక్టోబరు 1న 'శ్రామిక్ కల్యాణ్' పేరిట ఈ-అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది రైల్వే. దీని ద్వారా గుత్తేదారులు కనీస వేతన చట్టం నిబంధనలను పాటిస్తూ రోజువారి ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు ఎంత చెల్లిస్తున్నారో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒప్పంద కార్మికులకు జరుగుతున్న చెల్లింపులపై నిఘా వేయడానికి ఈ పోర్టల్ దోహదపడుతున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 2021 మార్చి 9 నాటికి ఇందులో 15,812 మంది గుత్తే దారులు, 3,81,881 మంది ఒప్పంద కార్మికులు రిజిస్టర్ అయినట్లు తెలిపింది.

రైల్వేశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వరంగ విభాగాలు ఈ-అప్లికేషన్‌ను వినియోగిస్తున్నాయి. ఇందులో గుత్తేదారులంతా ప్రతి కార్మికుడి సమగ్ర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. దీంతో కనీస వేతనాలు కార్మికులకు అందుతున్నదీ లేనిదీ తనిఖీ చేయడానికి వీలవుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​కు 170 మంది ఎమ్మెల్యేలు గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.