దేశవ్యాప్తంగా 2 వేల రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల కోసం ఉచిత వైఫై సౌకర్యాన్ని అందిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
"రాజస్థాన్‌లోని అజ్మేర్ డివిజన్‌కు చెందిన రాణా ప్రతాప్‌నగర్ రైల్వే స్టేషన్ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కలిగిన 2000వ స్టేషన్‌గా అవతరించింది." -పునీత్ చావ్లా, రైల్‌టెల్ సీఎండీ
రైల్‌టెల్..
రైల్వే పీఎస్‌యూ అయిన రైల్‌టెల్ భారతీయ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందించడం ప్రారంభించింది. రైల్వేలను డిజిటల్ వేదికగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టింది.
మొదటి దశలో దేశంలోని 16 వందల రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించారు. మిగతా అన్ని చోట్లా టాటా ట్రస్ట్ సౌజన్యంతో వైఫై అందిస్తోంది.
ప్రధానంగా గ్రామీణ, తక్కువ జనాభా సాంద్రత ఉన్న ప్రాంతాలకు ఉపయోగపడే చిన్న రైల్వే స్టేషన్లకు ఉచిత వైఫై సౌకర్యం కల్పించడంపై భారతీయ రైల్వే ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. తద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకూ అంతర్జాలం అందుబాటులోకి తీసుకురావాలన్నది ఆ సంస్థ ఆలోచన.
ఇదీ చూడండి: జియో గిగాఫైబర్ 'ఫిషింగ్ మెయిల్స్'తో జరభద్రం!