ETV Bharat / business

క్యూ2 ఫలితాలు, ద్రవ్యోల్బణం లెక్కలే మార్కెట్లకు కీలకం! - షేర్ మార్కెట్ ఔట్​లుక్

స్టాక్ మార్కెట్లకు (Stock market) ఈ వారం కంపెనీల 2021-22 క్యూ2 ఫలితాలు దిశా నిర్దేశం చేయనున్నాయంటున్నారు నిపుణులు. సెప్టెంబర్ నెలకు సంబంధించి స్థూల ఆర్థిక గణాకాలు (Market Outlook) కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని చెబుతున్నారు.

stocks outlook for this week
ఈ వారం స్టాక్ మార్కెట్​ అంచనాలు
author img

By

Published : Oct 10, 2021, 4:43 PM IST

కంపెనీల త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను (Stock Market) ముందుకు నడిపించనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు మార్కెట్లు ఈ వారం (Stock Markets this week) నాలుగు రోజులు మాత్రమే పని చేయనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించే అవకాశముందని (Stocks Outlook) చెబుతున్నారు.

  • 'దసరా' పండుగ సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు.

ఈ వారం.. 2021-22 రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే దిగ్గజ కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్​, విప్రో, హెచ్​సీఎల్ ​టెక్​ ముందు వరుసలో ఉన్నాయి. ప్రధాన టెక్​ కంపెనీలన్నీ ఈ వారమే క్యూ2 ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఒడుదొడుకులకు అవకాశమున్నట్లు స్వస్థికా ఇన్వెస్ట్​మార్ట్​ పరిశోధన విభాగాధిపతి సంతోశ్​ మీనా పేర్కొన్నారు.

ఫలితాలు కాకుండా.. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారం మార్కెట్లకు కీలకం కానున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం వెలువడనున్నాయి.

వీటన్నింటితో పాటు.. రూపాయి కదలికలు, ముడి చమురు ధరలు, కరోనా కేసులు, వ్యాక్సిన్ అప్​డేట్స్​ సహా విదేశీ పెట్టుబడులు మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.